
చేతిలో 6 రూపాయలు పెట్టి ‘వెళ్లి ఒంటి సబ్బు తీసుకురా’ అని నాన్న అంటే.. చటుక్కున పరిగెత్తుకెళ్లి సోప్ తెచ్చేవాళ్లం. అప్పట్లో దాని ధర అంతే మరి. 10-15 రూపాయలు ఇస్తే.. సోనా మసూరి బియ్యం సంచిలో పోసిచ్చేవారు కిరాణా వాళ్లు. ఓ 10వేలు చేతిలో ఉంటే.. ఆ కుటుంబానికి విలాసవంతమైన జీవితమే. డాడీ మంత్లీ సాలరీ 15, 20 వేలనుకోండి. లగ్జరీ లైఫ్ కిందే లెక్క. అలాంటి రోజుల నుంచి LKGకే 2 లక్షల రూపాయల ఫీజు కట్టే దాకా వచ్చాం. సారీ.. LKG కాదు, ప్రీస్కూల్‌కి కూడా లక్షకు తక్కువ లేదు కొన్నిచోట్ల. ఇన్ని మార్పులు చూసింది జస్ట్ ఈ 215 ఇయర్స్‌లోనే. కాలం భలే గమ్మత్తైంది. ప్రతి సెకను భవిష్యత్ వైపు పరుగులు తీస్తుంది, మనల్నీ తీసుకెళ్తుంది. కాని, మరీ ఇంత స్పీడా అనుకునేలా చేసింది మాత్రం ఈ పాతికేళ్ల కాలమే. ఒక టెక్నాలజీ షిఫ్ట్‌ను చూసిన పిరియడ్ ఇది. పాతకాలాన్ని చూస్తూ పెరిగి, కొత్తకాలంలోకి ఒదిగిపోయిన తీరు నిజంగా అద్భుతం. ఆ మ్యాజిక్‌ను ఇప్పుడు పుట్టిన వాళ్లు మిస్ అయ్యారు. ఓ 15 ఏళ్ల క్రితం పుట్టిన వారికి ఆ అనుభవం ఎలా ఉండేదే ఊహించుకోవడం కూడా కష్టమే. అంతటి అడ్వాన్స్‌డ్ జనరేషన్‌లోకి అడుగుపెట్టాం. ఒకప్పుడు రేడియోలోనే పాటలు, వార్తలు. అది కూడా అన్ని వేళలా వచ్చేవి కావు. తరువాత టేప్ రికార్డులు, టీవీలు, వీసీఆర్‌లు. అప్పట్లో అడ్వాన్స్‌డ్...