
బ్యాంకులు బంగారు రుణాలు ఇస్తాయి. బంగారు రుణంలో బ్యాంకులు ప్రజల బంగారాన్ని తనఖా పెట్టుకొని రుణాలు ఇస్తాయి. అటువంటి పరిస్థితిలో చాలా మంది డబ్బు అవసరమైనప్పుడు బంగారు రుణాలు కూడా తీసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో డబ్బు బాగా అవసరం అయినప్పుడు మీ దగ్గర బంగారం ఉంటే.. దాన్ని తనఖా పెట్టి గోల్డ్ లోన్ తీసుకోవాలా? లేదా అమ్మేయ్యాలా? ఏది చేస్తే మీకు ఎక్కువ లాభం వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
మీకు డబ్బు అవసరమైనప్పుడు మీరు మీ బంగారాన్ని అమ్మితే, మీ బంగారం శాశ్వతంగా పోతుంది. అదే సమయంలో బంగారు రుణంలో మీరు మీ బంగారంపై యాజమాన్యాన్ని నిలుపుకుంటారు, సకాలంలో రుణాన్ని తిరిగి చెల్లించడం ద్వారా మీరు మీ బంగారాన్ని తిరిగి పొందవచ్చు. అయితే బంగారు రుణంలో మీరు వడ్డీని చెల్లించాలి. బంగారం అమ్మకంపై మీరు ఎటువంటి వడ్డీ లేదా అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు మీ బంగారం పూర్తి విలువను పొందుతారు. కాబట్టి ఈ రెండు ఎంపికలలో ఏది మంచిది, అది ప్రతి వ్యక్తి పరిస్థితిని బట్టి మారవచ్చు. అది ఎలాగంటే..
మీకు చాలా తక్కువ వ్యవధికి చాలా తక్కువ మొత్తం అవసరమైతే, మీరు బంగారు రుణం తీసుకోవడం బెస్ట్. అలాగే మీరు లోన్ EMIని సకాలంలో చెల్లించగలిగినప్పటికీ బంగారు రుణాన్ని ఎంచుకోండి. ఇది కాకుండా కొన్నిసార్లు బంగారు ఆభరణాల పట్ల భావోద్వేగ అనుబంధం కూడా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో కూడా గోల్డ్ లోన్ తీసుకోవడం ఉత్తమం.
మీకు ఎక్కువ డబ్బు అవసరమైతే, చాలా కాలం పాటు డబ్బు అవసరమైతే, మీరు బంగారాన్ని అమ్మవచ్చు. అదే సమయంలో మీరు రుణం తిరిగి చెల్లించలేకపోతే మీరు బంగారాన్ని అమ్మవచ్చు. ఇది కాకుండా మీరు ఎటువంటి వడ్డీ చెల్లించకూడదనుకున్నా కూడా బంగారాన్ని అమ్మవచ్చు. సో.. బంగారం తనఖా పెట్టాలా? లేదా అమ్యేలా అన్నది మీ ఆర్థిక అవసరాలపై ఆధారపడి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి