
డబ్బు అవసరమైనప్పుడు చాలామంది బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటుంటారు. మరికొంతమంది డైరెక్ట్ గా పర్సనల్ లోన్ అప్లై చేస్తుంటారు. అయితే ఈ రెండింటిలో దేనికుండే బెనిఫిట్ దానికుంది. అయితే గోల్డ్ లోన్ , పర్సనల్ లోన్ మధ్య ఉండే బేసిక్ డిఫరెన్స్ ఏంట? ఏది ఏ సందర్భంలో మంచిది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గోల్డ్ లోన్ అంటే బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి తీసుకునే లోన్. మీ దగ్గర బంగారం ఉంటే ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు. అయితే మీరు తాకట్టు పెట్టిన గోల్డ్ వాల్యూలో 75% నుంచి 80% వరకూ మాత్రమే మీకు లోన్ లభిస్తుంది. లోన్ పూర్తిగా చెల్లించిన తర్వాతే గోల్డ్ తిరిగి వస్తుంది. ఒకవేళ సమయానికి తిరిగి చెల్లించకలేకపోతే మీ బంగారాన్ని వదులుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు కచ్చితంగా తిరిగి చెల్లించగలరు అనుకున్నప్పుడు గోల్డ్ లోన్ మంచి ఆప్షన్ అవుతుంది. అలాగే గోల్డ్ లోన్ వేగంగా ప్రాసెస్ అవుతుంది. వడ్డీ రేటు కూడా తక్కువ ఉంటుంది. క్రెడిట్ స్కోర్ అవసరం కూడా లేదు.
ఇక పర్సనల్ లోన్ విషయానికొస్తే.. ఇది ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఇచ్చే లోన్. మీ క్రెడిట్ స్కోర్ ను బట్టి లోన్ అప్రూవ్ అవుతుంది. డాక్యుమెంటేషన్ ఎక్కువ. లోన్ అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ మీ ప్రోఫైల్ ను బట్టి మారుతుంటాయి. ఒకవేళ మీ క్రెడిట్ ప్రొఫైల్ బాగోపోతే మీరు ఆశించినంత లోన్ పొందలేకపోవచ్చు. గోల్డ్ లోన్ తో పోలిస్తే పర్సనల్ లోన్ లో వడ్డీ ఎక్కువ ఉంటుంది. మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉండి, ఎక్కువ మొత్తంలో లోన్ కావాలి అనుకున్నప్పుడు పర్సనల్ లోన్ మంచి ఆప్షన్. ఒకవేళ మీ దగ్గర బంగారం ఉంటే గోల్డ్ లోన్ ను ప్రిఫర్ చేయడమే మంచిదనేది నిపుణుల అభిప్రాయం.
మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి