Gold: 6 నెలల వరకు బంగారం కొనలేమా.? బాబోయ్.! ఆల్‌టైమ్ రికార్డు.. నిపుణులు ఏమన్నారంటే

బంగారం కొనాలనుకున్నవారికి అచ్ఛేదిన్‌ ముగిసినట్లే. గోల్డ్‌ షాపింగ్‌ చేయాలనుకున్నవారు తమ కొనుగోళ్లు తగ్గించుకోవాల్సిందే. ఇక దిగువ మధ్యతరగతి కుటుంబాలైతే పసిడి మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఎందుకంటే గోల్డ్‌ ధరలు పెరుగుతున్నాయి. ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఈ స్టోరీలో ఇప్పుడు తెలుసుకుందామా మరి.?

Gold: 6 నెలల వరకు బంగారం కొనలేమా.? బాబోయ్.! ఆల్‌టైమ్ రికార్డు.. నిపుణులు ఏమన్నారంటే
Gold Rates Today

Updated on: Jan 24, 2025 | 11:54 AM

ట్రంప్‌ జమానాలో బంగారం ధరలు ఊపందుకున్నాయి. వచ్చే 6 నెలల వరకు బంగారం రేట్లు అస్థిరంగా కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. అప్పటివరకు అధిక ధరలు కొనుగోళ్లపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంటున్నారు. ఇన్వెస్టర్లకు మాత్రం ఉపయోగకరమేనని అంటున్నారు. స్పాట్‌ గోల్డ్‌, గోల్డ్‌ ఫ్యూచర్స్‌‌లో దూకుడు కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర 2781 డాలర్లుగా ఉంది. అటు మనదేశంలోనూ బంగారం ధర పెరుగుతోంది. ఇండియన్ బులియన్, జువెలరీ అసోసియేషన్(IBJA) ప్రకారం తొలిసారి రూ. 80, 194 దాటింది. 2024, అక్టోబర్ 30 నాటి రూ. 79, 681ని దాటేసింది. ట్రంప్‌ తాజా నిర్ణయాలతో ఆర్థికవ్యవస్థలు దెబ్బతింటాయని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే బంగారం ధరలు పెరుగుతున్నాయి.

బంగారం పెరగడానికి 4 కారణాలు..

బంగారం పెరగడానికి నాలుగు కారణాలు కనిపిస్తున్నాయన్నారు బిజినెస్ నిపుణులు. అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్‌ పెరుగుతోందని.. ట్రంప్‌ వచ్చిన తర్వాత ఆర్థికమాంద్య భయాలు పెరిగిపోయాయని తెలిపారు. బంగారం నిల్వలు పెంచుకోవడానికి అన్ని దేశాల సెంట్రల్‌ బ్యాంకులు ఫోకస్‌ చేస్తున్నాయి. మరోవైపు అంతర్జాతీయంగా యుద్ధభయాలు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో స్టాక్‌మార్కెట్లు అంత సేఫ్‌ కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే బంగారంపై భారీగా పెట్టుబడులు పెరుగుతున్నాయి. అలాగే మన స్టాక్‌మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ షేర్లను అమ్ముకుంటున్నారు. దీంతో డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం పతనం అవుతోంది. ఈ అన్ని కారణాలతో బంగారం ధర పెరుగుతోందని ఆర్ధిక వేత్తలు అంచనా వేస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి