
బంగారం కొనుగోలు చేసేవారికి బిగ్ షాక్ తగిలింది. గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. ఒకేసారి ఏకంగా రూ.2 వేల వరకు పెరిగింది. ఒకేసారి రూ.2 వేలు పెరగడంతో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి చేదువార్తగా మిగిలింది. ఆదివారంతో పోలిస్తే సోమవారం గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. ఇక బంగారంతో పాటు వెండి రేట్లు కూడా ఆమాంతంగా పెరిగాయి. తులం బంగారం ఏకంగా రూ.లక్ష 45 వేల మార్క్ దాటగా.. కేజీ వెండి రూ.3 లక్షల మార్క్ క్రాస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు సోమవారం ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,45,690కు చేరుకుంది. నిన్న ఈ ధర రూ.1,43,780గా ఉండగా.. నిన్నటితో పోలిస్తే రూ.1,910 పెరిగింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు ఆదివారం రూ.1,31,800గా ఉండగా.. సోమవారం నాటికి రూ.1,33,850కి చేరుకుంది. నిన్నటితో పోల్చి చూసుకుంటే రూ.1750 పెరిగింది
-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,690గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,33,550 వద్ద కొనసాగుతోంది
-ఇక చెన్నైలో చూస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ రేటు రూ.1,46,730 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,34,500గా ఉంది. నిన్నటితో చూస్తే ఏకంగా రూ.1860 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,34,500గా ఉంది. ఆదివారం ఈ ధర రూ.1,32,800గా ఉండగా.. రూ.1700 మేర పెరిగింది
-బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,45,690గా ఉంది. నిన్న ఈ ధర రూ.1,43,780గా ఉంది. ఇక 22 క్యారెట్ల చూస్తే రూ.1,33,550గా ఉంది
-ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,840 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,33,700గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.1910 పెరిగింది
-ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.3,05,000 వద్ద కొనసాగుతోంది. నిన్న రూ.2,95,000గా ఉండగా.. ఈ రోజు రూ.10 వేలు పెరిగింది
-హైదరాబాద్‌లో కేజీ వెండిపై రూ.8 వేలు పెరిగింది. ఆదివారం రూ.3,10,000గా ఉండగా.. ఇవాళ రూ.3,18,000కి పెరిగింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి
-ఇక చెన్నైలో కేజీ వెండి ధర రూ.3,18,000 వద్ద కొనసాగుతోంది. నిన్న రూ.3,10,000గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.8 వేల మేర పెరిగింది
-బెంగళూరులో కేజీ వెండి ధర రూ.3,05,000 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.2,95,000 వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే రూ.10 వేల మేర పెరుగుదల నమోదు చేసింది
-గత ఏడాది 2025 జనవరి 20న కేజీ సిల్వర్ ధర రూ.1,04,00గా ఉండగా.. 2026 జనవరి 19 నాటికి 3 లక్షలకు చేరుకుంది. అంటే ఏడాదిలో రెండు లక్షల మేర వెండి ధర పెరిగింది