Gold Silver Price Today: దేశంలో కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఎన్నడులేనంతగా ఏడాది ప్రారంభంలోనే పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. రూ.57వేల మార్క్ దాటి పరుగులు పెడుతున్నాయి. తాజాగా, బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగగా.. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.51,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.55,750 గా ఉంది. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.150, 24 క్యారెట్లపై రూ.170 మేర ధర పెరిగింది. దేశీయంగా కిలో వెండి ధర రూ.72,000 లుగా కొనసాగుతోంది. తాజాగా పెరిగిన ధరల ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.55,750 గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,750 కొనసాగుతోంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,750 గా కొనసాగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,900 ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,750 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,380, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,140 గా కొనసాగుతోంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,750 గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,800 గా ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,750 గా ఉంది.
ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.72,000 లుగా ఉంది.
ముంబైలో కిలో వెండి ధర రూ.72,000
చెన్నైలో కిలో వెండి ధర రూ.75,500
బెంగళూరులో రూ.75,500
కేరళలో 75,500
కోల్‌కతాలో 72,000
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,500
విజయవాడలో రూ.75,500
విశాఖపట్నంలో రూ.75,500 లుగా కొనసాగుతోంది.
గమనిక: ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.