Gold and Silver Price: స్వల్పంగా పెరిగిన పసిడి ధర, స్థిరంగా కొనసాగుతున్న వెండి.. ఈ రోజు ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయంటే..

గత కొన్ని రోజుల క్రితం ఆల్ టైం హైకి చేరుకున్న పసిడి ధర క్రమంగా దిగివస్తుంది. రెండు రోజులుగా తగ్గుదల చూసిన పసిడి ధరతో దేశీయంగా కూడా పసిడి ధర పరుగుకి కళ్ళెం పడింది అని భావిస్తున్న నేపధ్యంలో నేడు స్వల్పంగా పెరిగింది. అయితే బంగారంతో పాటు వెండి ధరల్లో కూడా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. కానీ గత కొన్ని నెలలుగా కిలో వెండి లక్ష రూపాయలు మార్క్ ని దిగడం లేదు. ఈ నేపధ్యంలో మే 14 వ తేదీన పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Gold and Silver Price: స్వల్పంగా పెరిగిన పసిడి ధర, స్థిరంగా కొనసాగుతున్న వెండి.. ఈ రోజు ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold And Silver Price

Updated on: May 14, 2025 | 6:43 AM

బంగారం ధరలపై అంతర్జాతీయ మార్కట్ ప్రభావం దేశీయంగా పడుతుంది. డాలర్ మారకం ఆధారంగా పసిడి ధరలు ఉంటాయి. ఈ నేపధ్యంలో దేశీయంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. గత రెండు రోజులుగా దిగి వచ్చిన పసిడి ధర ఈ రోజు కొంత మేర పెరిగింది. అయితే ఇప్పుడిప్పుడే యుద్ధ భయాలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గుతుందని భావిస్తున్న పసిడి ప్రియులకు షాక్ ఇచ్చి స్వల్పంగా పెరుగుదలను నమోదు చేసింది. అయితే బంగారం బాటలో పయనిస్తున్న వెండి ధరలు ఈ రోజు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. నేపధ్యంలో మే 14 తేదీ బుధవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలోని ప్రధాన నగరాల్లో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు

ఈ రోజు అంటే మే 14 వ తేదీ బుధవారం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల గురించి తెలుసుకుందాం..

హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 88,560 ఉంది. మంగళవారంతో పోల్చితే రూ.10 పెరిగింది. మరోవైపు ప్యూర్ గోల్డ్అంటే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర కూడా పది రూపాయలు పెరిగి రూ.96,610 లు గా కొనసాగుతోంది.

ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్టణం, పొద్దుటూరు, వరంగల్ నగరాల్లో కూడా కొనసాగుతున్నాయి.

దేశంలో ప్రధాన నగరాల్లో నేటి పసిడి ధరలు

ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 88710 ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 96760ఉంది.

చెన్నై లో ఈ రోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ 88,560ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.96,610లుగా కొనసాగుతోంది.

దేశ రాజధాని ముంబైలో ఈ రోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.88,560 లు ఉండగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 96,610 లుగా కొనసాగుతోంది

కోల్‌కతాలో ఈ రోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.88,560 ఉంది, ప్యూర్ గోల్డ్ (24 క్యారెట్ల బంగారం) 10 గ్రాములకు రూ. 96,610ఉంది.

బెంగళూరులో ఈ రోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.88,560 ఉంది, ప్యూర్ గోల్డ్ (24 క్యారెట్ల బంగారం) 10 గ్రాములకు రూ. 96,610గా కొనసాగుతోంది

కేరళలో ఈ రోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.88,560 ఉంది, ప్యూర్ గోల్డ్ (24 క్యారెట్ల బంగారం) 10 గ్రాములకు రూ. 96,610ఉంది.

వెండి ధర ఎలా ఉన్నందంటే..

బంగారం తర్వాత అత్యధికంగా కొనుగోలు చేసే లోహం వెండి. పండగలు, శుభకార్యాలు ఎ సందర్భంలోనైనా సరే వెండి వస్తువుల కొనుగోలుకు ఆసక్తిని ఎక్కువ చూపిస్తున్నారు. గత కొన్ని ఏళ్లుగా వెండిపై పెట్టుబడులు పెట్టడం లాభసాటిగా భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో దేశంలో వెండి ధరలు గత కొన్ని రోజులుగా కిలో లక్షకు పైగా ఉంటుంది. అయితే ఈ రోజు వెండి ధరలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. స్థిరంగా కొనగాతోంది. దీంతో ఈ రోజు కిలోవెండి రూ. 1,08,900లుగా కొనసాగుతోంది.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..