
Gold, Silver Prices: 2025లో బంగారం, వెండి ధరలు వేగంగా పెరిగాయి. కొన్ని రోజుల క్రితం బంగారం, వెండి ధరలు తగ్గాయి. అయితే, నవంబర్ చివరి వారంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. వెండి ధరలు మరోసారి రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దేశీయ మార్కెట్లో బంగారం ధరను పరిగణనలోకి తీసుకుంటే భారీగానే పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ కారణంగా వల్ల బంగారం డిమాండ్ పెరిగింది. ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ వెబ్‌సైట్ ప్రకారం.. నవంబర్ 21న 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,23,146. నవంబర్ 28న ఇది రూ.1,26,591కి చేరుకుంది. అంటే దేశీయ మార్కెట్లో బంగారం ధర రూ.3445 పెరిగింది. నవంబర్ 30న తులం ధర రూ.1,29,820 ఉంది. అంటే రూ.6 వేలకుపైగా పెరిగింది. ఒక్క వారంలోనే ఇంత పెరిగింది.
IBJA రేట్లు, ఆభరణాల వ్యాపారుల నుండి బంగారం రేట్ల మధ్య వ్యత్యాసం ఉండవచ్చు. దేశంలోని ప్రతిచోటా IBJA రేట్లు ఒకే విధంగా ఉంటాయి. అయితే వాటిలో జీఎస్టీ, తయారీ ఛార్జీలు ఉండవు. ఆభరణాల కొనుగోలుపై 3 శాతం GST ఉంటుంది. అంతేకాకుండా తయారీ ఛార్జీలు కూడా చెల్లించాలి.
బంగారం ధర పెరుగుతుంటే వెండి రేటు కూడా అదే దారిలో వెళ్తోంది. నవంబర్ 21న ఒక కిలో వెండి రేటు రూ.1,61,000 ఉండగా, నవంబర్ 28న రూ.176,000కి చేరుకుంది. అదే నవంబర్ 30 నాటికి కిలో వెండి ధర రూ.1,85,000 వద్ద కొనసాగుతోంది. అంటే వారం రోజుల్లో దాదాపు రూ.24 వేల వరకు పెరిగింది.
ఇంతలో భారతదేశంలో బంగారం ధరలు పెరగడానికి రెండు కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి US ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేటును తగ్గించే అవకాశం పెరగడం. దీనితో పాటు, భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో బంగారం, వెండికి డిమాండ్ పెరిగింది. ఫలితంగా బంగారం, వెండి ధరలు పెరిగాయి. ప్రపంచ మార్కెట్లో అనిశ్చితి పెరిగినప్పటికీ, పెట్టుబడిదారులు సురక్షితమైన ఎంపికగా బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి