Gold Silver Price Today: మహిళలకు గుడ్ న్యూస్. బంగారం ధరలు మరింత తగ్గాయి. బుధవారం 10 గ్రాముల బంగారంపై దాదాపు వెయ్యి రూపాయల మేర తగ్గగా.. నేడు మరో రూ. 250 మేర తగ్గింది. కొన్ని నగరాల్లో అయితే రూ.350 మేర తగ్గడం విశేషం. అయితే నిన్న బంగారం బాటలోనే పయనించిన వెండి ధరలు మాత్రం కాస్త పెరిగాయి. కిలో వెండిపై సుమారు రూ. 200మేర పెరిగింది. మరి గురువారం (జూన్16) రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి తెలుసుకుందాం రండి.
☛హైదరాబాద్: 22 క్యారెట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.47,150గా ఉంది. నిన్నటితో పోల్చితే ఏకంగా రూ.250 దిగిరావడం గమనార్హం. ఇక 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.51,440కి తగ్గింది.
☛ విజయవాడ : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,440 వద్ద కొనసాగుతోంది.
☛ విశాఖ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,150పలుకుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,440 వద్ద ఉంది.
☛ చెన్నై : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,500 పలుకుతోంది.
☛ ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51, 440 వద్ద కొనసాగుతోంది.
☛ ఢిల్లీ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,170గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,440 పలుకుతోంది.
☛ కోల్‌కతా : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,440 వద్ద ఉంది.
☛ బెంగళూరు : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,170ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,440 పలుకుతోంది.
☛ కేరళ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,440 వద్ద ఉంది.
పెరిగిన సిల్వర్ ధరలు..
ఇక బుధవారంతో పోల్చుకుంటే వెండి ధరలు కూడా కాస్త పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.66,000గా ఉంది. ఇక విజయవాడ, విశాఖ, చెన్నై నగరాల్లోనూ ఇదే ధర వద్ద వెండి కొనసాగుతోంది. ముంబైలో రూ.60,000, ఢిల్లీలో రూ.60,000, కోల్‌కతాలో రూ.60,000 బెంగళూరులో రూ.66,000, కేరళలో రూ..66,000 పలుకుతున్నాయి.
గమనిక:
బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజూ మార్పులు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పు, జ్యువెలరీ మార్కెట్లలో నగలకు డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి బంగారం, వెండిని కొనుగోలు చేయలనుకునేవారు ఈ అంశాలన్నింటినీ పరిశీలించుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..