Gold and Silver Price Today: దేశీయంగా దిగి వచ్చిన బంగారం, వెండి ధరలు.. పలు నగరాల్లో స్వల్పంగా పెరుగుదల..!

|

Jul 11, 2021 | 6:13 AM

Gold and Silver Price Today: బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌. పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలకు కాస్త బ్రేకులు పడ్డాయి. గత వారం రోజుల నుంచి..

Gold and Silver Price Today: దేశీయంగా దిగి వచ్చిన బంగారం, వెండి ధరలు.. పలు నగరాల్లో స్వల్పంగా పెరుగుదల..!
Gold And Silver
Follow us on

Gold and Silver Price Today: బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌. పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలకు కాస్త బ్రేకులు పడ్డాయి. గత వారం రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు తాజాగా శనివారం దిగి వచ్చాయి. మహిళలు అత్యంతగా ఇష్టపడే బంగారంకు భారతదేశంలో డిమాండ్‌ బాగా ఉంటుంది. అందుకే బంగారం ధరలపై చాలా మంది ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. ఇక తాజాగా వెండి కూడా దిగి వచ్చింది. అయితే ఇంకో విషయం ఏంటంటే దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గినా.. హైదరాబాద్‌తో పాటు కొన్ని ప్రధాన నగరాల్లో స్వల్పంగా పెరిగింది.  కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో శనివారం ఉదయం 6 గంటల నాటికి నమోదైన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశంలో ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

► దేశ ఆర్థిక రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 ఉంది.

► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,310 ఉంది.

► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,810 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,810 ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉంది.

► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,820 ఉంది.

► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,820 ఉంది.

► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,820 ఉంది.

► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,820 ఉంది.

వెండి ధరలు

ఇక దేశీయంగా వెండి ధరలు పెరిగాయి. దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో ధరలు హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.68,800 ఉండగా, చెన్నైలో రూ.73,400 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.68,800 ఉండగా, కోల్‌కతాలో రూ.68,800 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.68,800 ఉండగా, కేరళలో రూ.68,800 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,400 ఉండగా, విజయవాడలో రూ.73,400 వద్ద కొనసాగుతోంది.

అయితే బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి

Zomato: మీరు జోమాటో యాప్‌ వాడుతున్నారా..? మీకో బంపర్‌ ఆఫర్‌.. రూ.3 లక్షలు గెలుచుకునే అవకాశం.. ఎలాగంటే..!

Amazon Prime Day: వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్స్‌ వచ్చేసింది.. ఎప్పటి నుంచి అంటే..!