Gold & Silver Price Today: దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు నేల చూపులు చూస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు పడిపోతూ వస్తున్నాయి. గురువారం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 43,960 దగ్గరకు చేరింది. అటు 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 44,960 కొనసాగింది.
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,150 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.48,160 ఉంది. ఇక హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.42,010 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.45,830 కొనసాగుతుంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,960 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.44,960 ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.42,010 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.45,830 ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.42,370 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.46,220 దగ్గర కొనసాగుతుంది.
ఇదిలా ఉంటే బంగారం ధరలు స్వల్పంగా పెరిగాగా.. వెండి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. గురువారం ఉదయం దేశీయ మార్కెట్లో వెండి ధరలు పతనమవుతున్నాయి. ఇవాళ ఉదయం మార్కెట్లో కిలో వెండి ధర రూ.67,000 ఉంది. నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ రూ.600 తగ్గింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,000 ఉంది. ఇక హైదరాబాద్ మార్కెట్లో కేజీ సిల్వర్ రేట్ రూ.71,600గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.67,000 గా ఉంది. విజయవాడ మార్కెట్లో కేజీ సిల్వర్ రూ.71,600గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి రూ.71,600 గా ఉంది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల వెండి ధర రూ.716 ఉండగా.. 100 గ్రాముల వెండి ధర రూ.7,160 దగ్గర కొనసాగుతుంది. బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయం అని చెప్పుకోవచ్చు.
Also Read:
బంగారం పై పెట్టుబడులు పెడుతున్నారా ? అయితే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..