నిత్యం గోల్డ్, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. గ్లోబల్ మార్కెట్ సంకేతాలు, అంతర్జాతీయంగా బంగారం నిల్వలు.. ఇంకా మరిన్ని అంశాలు ఈ గోల్డ్ రేట్స్ మార్పులకు కారణం అవుతుంటాయి. గత రెండు, మూడు రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ. 1860 మేరకు పెరగ్గా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1710 మేరకు పెరిగింది. మరి ప్రస్తుతం దేశంలోని పలు నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం.
బంగారం ధరలు భారీగా పెరిగాయి. తొలిసారి బంగారం ధర 80వేలను తాకింది. హైదారాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 80వేల 170రూపాయలుగా నమోదైంది. ఇక 22 క్యారెట్ల బంగారం 74వేల 240రూపాయలకు చేరింది. వెండి, బంగారం ధరలు షాకిస్తున్నాయి. గత రెండు రోజులుగా భారీ పెరుగుదల నమోదు అవుతుంది. గ్లోబల్ ట్రెండ్‌తో నగల వ్యాపారులు, స్టాకిస్టుల కొనుగోళ్ల పెరుగుదల కారణంగా దేశ రాజధానిలో బంగారం ధరలు 80వేల రూపాయలకు చేరుకున్నాయి. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.620 పెరిగి మూడు వారాల గరిష్ఠ స్థాయి రూ.80వేల 170కి చేరుకుంది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర 74వేల 240 రూపాయలుగా నడుస్తోంది. వెండి ధర వరుసగా మూడో రోజు కూడా పెరుగుతూ 1450 రూపాయలు పెరిగి కిలో ధర 95వేల 500కి చేరుకుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి