Gold And Silver Price Today( January 15th 2022): భారతీయులకు బంగారానికి అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ ప్రజలు బంగారాన్ని(gold Price) కూడా ఓ ఆస్తిగా భావిస్తారు. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఇలా ఏ చిన్న సందర్భం వచ్చినా వెంటనే బంగారం నగలు కొనుగోలు పై ఆసక్తిని చూపిస్తారు. వివాహం, పండుగలు, పుట్టిన రోజు వంటి ప్రత్యేక సందర్భాల్లో అయితే బంగారం, వెండి (gold and Silver) వస్తువులను గిఫ్ట్ గా ఇవ్వడం కూడా ఓ స్టేటస్ గా భావిస్తారు. ఒకప్పుడు బంగారం ఎప్పుడైనా అనుకోని ఆర్ధిక కష్టాలు ఎదురైతే.. తమను పసిడి గట్టెక్కిస్తుందని భావించేవారు.. అయితే కాలంలో వచ్చిన మార్పులతో ఇప్పుడు బంగారం కొనుగోలుని ఒక పెట్టుబడిగా కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా కరోనా వెలుగులోకి వచ్చిన అనంతరం పసిడి, వెండి పై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. అందుకనే పసిడి ధరలు రోజు రోజుకీ పైపైకి పెరిగాయని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత బంగారం, వెండి ఆల్ టైం హై కి చేరుకున్నాయి. అప్పటినుంచి ధరల్లో స్థిరత్వం ఏర్పడలేదు. ఒకరోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతూ.. అస్థిరంగా కొనసాగుతున్నాయి.
దేశీయంగా బంగారం పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణం.. బంగారం ధరపై అంతర్జాతీయంగా ధరలు మార్పుతో పాటు.. దేశీయ కేంద్ర బ్యాంకుల బంగారం రిజర్వ్, నిలకడ లేని వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, నగల మార్కెట్లు సహా అనేక అంశాలు ప్రభావం చూపిస్తాయి. గ్లోబల్ గోల్డ్ రేట్లలో హెచ్చుతగ్గులు ఉండేలా చేస్తాయి.
ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలని భావించే వినియోగదారుల కోసం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశంలోని వివిధ ముఖ్య నగరాల్లో జనవరి 15 తేదీ 2022 శనివారం రోజున బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
హైదరాబాదులో నగలకు ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర నిన్న (శుక్రవారం) రోజున రూ. 45,000గా ఉండగా నేడు కూడా అదే ధర స్థిరంగా కొనసాగుతోంది. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర కూడా నిన్నటి రూ. 49,100గా ఉంది. ఈరోజు కూడా అదే ధరలు కొనసాగుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు:
ప్రపంచ మార్కెట్లలో విలువైన లోహాల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని బులియన్ మార్కెట్‌లో దేశ రాజధాని ఢిల్లీలో కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,440గా ఉంది.
దేశంలో ప్రధాన నగరమైన చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,450గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,590గా ఉంది.
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా బంగారం ధర స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,980గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,980గా ఉంది.
వెండి ధరలు: మన దేశంలో బంగారం తర్వాత ఖరీదు చేసే లోహం వెండి. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పూజలు వంటి సమయంలో వెండి వస్తువుల ఖరీదుకి ఆసక్తిని చూపిస్తారు. ముఖ్యంగా బహుమతులు ఇవ్వడానికి వెండి వస్తువులను ఎంపిక చేసుకుంటారు. ఈ నేపథ్యంలో మనదేశంలో కిలో వెండి ధర విషయానికి వస్తే.. నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గింది.కిలోకి రూ. 100 మేర తగ్గింది.దీంతో దేశీయ మార్కెట్ లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ 65,900గా ఉంది. ఇదే ధరలు హైదరాబాద్, విశాఖ, విజయవాడలతో పాటు చెన్నై లో కూడా కొనసాగుతున్నాయి. అయితే ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో మాత్రం కిలో వెండి ధర రూ. 62,200గా ఉంది. దాదాపు మూడు వేళా రూపాయలకు పైగా తేడా ఉంది.
గమనిక: ఈ పసిడి వెండి ధరలు.. ఈ రొజు ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అయితే ఈ ధరలలో హెక్చుతగ్గులు స్థానిక పరిస్థితిని బట్టి కూడా ఏర్పడవచ్చు. కొనుగోలు దారులు ఈ విషయాన్నీ గమనించాల్సి ఉంటుంది.
Also Read: