భారతీయులు పండగలు, పెళ్ళిళ్ళు, శుభకార్యాలు వంటి స్పెషల్ డేస్ లో మాత్రమే కాదు ఎప్పుడు డబ్బులు అందుబాటులో ఉంటే అప్పుడు.. ఏడాది పొడవునా బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తినిమ చూపిస్తూ ఉంటారు. భారతీయులు బంగారం నగలను ఓ స్టేటస్ సింబల్ గా చూస్తారు. అంతేకాదు ఎప్పుడైనా అనుకోని విధంగా ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడితే ఆపద సమయంలో ఆదుకుంటుంది అని కూడా భావిస్తారు. ఇక కరోనా తర్వాత నుంచి ముదుపరులు బంగారాన్ని ఓ పెట్టుబడిగా భావిస్తున్నారు. ఈ నేపద్యంలో ఒకానొక సమయంలో ఆల్ టైం హైకి చేరుకుంది పసిడి. అయితే అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం డాలర్ బలపడడంతో బంగారం ధరలు క్రమేపీ దిగివస్తున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు (డిసెంబర్ 24వ) మంగళవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
దేశంలో బంగారం ధర స్వల్పంగా దిగి స్తుంది. అయితే మంగళవారం రోజున పసిడి ధర స్థిరంగా కొనసాగుతోంది. సోమవారం మాదిరిగానే నేడు (డిసెంబర్ 24వ తేదీ) మంగళవారం 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్ల ధర రూ. 70,990 వద్ద ఉంది. ఇదే విధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,440గా కొనసాగుతోంది.
మన దేశంలో బంగారం తర్వాత అంత ఆదరణ పొందిన లోహం వెండి. పెళ్ళిళ్ళు, పంక్షన్లు వస్తే చాలు వెండి వస్తువులు బహుమతులుగా ఇవ్వడానికి ఆసక్తిని చూపిస్తారు. ఇప్పుడు వెండితో చేసిన ఆభరణాలు కూడా ఒక ట్రెండీగా నిలుస్తున్నాయి. ఈ నేపధ్యంలో కిలో వెండి ధర ఒకానొక సమయంలో లక్ష దాటింది కూడా.. ఈ నేపధ్యంలో నేటి వెండి ధర ఎలా ఉన్నదో తెలుసుకుందాం..
దేశ వ్యాప్తంగా పసిడి ధర స్థిరంగా ఉంటె.. వెండి ధర మాత్రం ఈ రోజు ( మంగళవారం) స్వల్పంగా దిగి వచ్చింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 100 మేర తగ్గి రూ. 91,300వద్ద కొనసాగుతోంది.