Gold and Silver Price Today: పెరిగిన బంగారం ధరలు.. తగ్గుతోన్న వెండి.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..
భారతీయులు పసిడి ప్రియులు. బంగారం, వెండి వంటి లోహాలను కొనుగోలు చేయడనికి ఎక్కువగా ఇష్టపడతారు. బంగారం నగలు అలంకారానికి, స్టేటస్ సిబంల్ గా మాత్రమే కాదు కరోనా తర్వాత పసిడి, వెండిని మంచి పెట్టుబడిగా కూడా భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో పసిడికి వెండి భారీ డిమాండ్ నెలకొంది. అయితే అంతర్జాతీయ మార్కెట్ పరిస్తితులను బట్టి దేశీయంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు (మే 17వ తేదీ) శనివారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

పసిడి ప్రియులకు ఊరటనిచ్చేలా గత కొంతకాలం నుంచి బంగారం ధరలు తగ్గతూ వచ్చాయి. నెల క్రితం లక్ష రూపాయల దగ్గర ట్రేడ్ అయిన స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 95 వేలకు పడిపోయింది. 22 క్యారెట్ల బంగారం 87 దిగువన ట్రేడ్ అవుతోంది. దీంతో శుభకార్యాలకు బంగారం కొనాలనుకున్న వారు షాపులకు ఎగబడ్డారు. మరికొంతమంది మాత్రం బంగారం ఇంకా కొంచెం తగ్గితే తీసుకుందామని అనుకున్నారు. అయితే, ఇప్పుడు బంగారం కొనాలనుకునే వారికి నిజంగా ఇది షాకింగ్ విషయమే.. బంగారం ధరలు పెరిగాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో శనివారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే…
హైదరాబాద్ నగరంలో పసిడి ధర శుక్రవారం 10 గ్రాముల మేలిమి 24 క్యారెట్ల బంగారం ధర రూ. 95,130 ఉంది. ఈ రోజు 10 రూపాయలు పెరిగి 95140 లకు చేరుకుంది. మరోవైపు శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 87,200 లు ఉండగా.. 10 రూపాయల మేర పెరిగి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 87210లకు చేరుకుంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన పొద్దుటూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, నిజామాబాద్ సహా ప్రధాన నగరాల్లో కొనసాగుతున్నాయి.
దేశంలో ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధర నిన్నటి కంటే స్వల్పంగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్ల ధర రూ. 87360గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 95290కు చేరుకుంది. ఇక చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, కేరళ వంటి ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్ల ధర రూ. 87,210లు ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.95,140లకు చేరుకుంది.
నేటి వెండి ధరలు
బంగారం తర్వాత అధికంగా కొనుగోలు చేసే లోహం వెండి .. దీని ధరలు గత కొంత కాలంగా మెల్లగా దిగుతూ వస్తున్నాయి. ఈ రోజు కూడా కేజీకి రూ. 100 లు తగ్గి వెండి ధర రూ. 1,07,900లకు చేరుకుంది.
మరిని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








