Revolt RV 400: ఎలక్ట్రిక్ బైక్‌పై అదిరే ఆఫర్.. రూపాయి కట్టకుండా బండిని ఇంటికి తెచ్చుకోవచ్చు..

|

Jul 17, 2024 | 2:23 PM

రివోల్ట్ తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఆర్వీ400 పై కొత్త ఫైనాన్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద, ఎవరైనా ఎటువంటి డౌన్ పేమెంట్ చెల్లించకుండానే ఇ-మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేయవచ్చు. అంతేకాక నెలవారీ ఈఎంఐ కూడా రూ. 4,444 మాత్రమే పడుతుంది. కొనుగోలుదారులు ఆదాయ రుజువును చూపాల్సిన అవసరం లేదు. ప్రాసెసింగ్ రుసుము చెల్లించాల్సిన పనిలేదు.

Revolt RV 400: ఎలక్ట్రిక్ బైక్‌పై అదిరే ఆఫర్.. రూపాయి కట్టకుండా బండిని ఇంటికి తెచ్చుకోవచ్చు..
Revolt Rv 400
Follow us on

మీరు ఏదైనా ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేస్తున్నారా? అయితే అధిక ధర అవుతుందని ఆలోచిస్తున్నారా? కనీసం ఫైనాన్స్ సౌకర్యం పొందాలన్నా.. డౌన్ పేమెంట్ కు కూడా డబ్బు సర్దుబాటు కాక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. జీరో డౌన్ పేమెంట్ సదుపాయంతో ఎలక్ట్రిక్ బైక్ ను కొనుగోలు చేసే అవకాశాన్ని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన బ్రాండ్ రివోల్ట్ మోటార్స్ అందిస్తోంది. రివోల్ట్ తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఆర్వీ400 పై కొత్త ఫైనాన్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద, ఎవరైనా ఎటువంటి డౌన్ పేమెంట్ చెల్లించకుండానే ఇ-మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేయవచ్చు. అంతేకాక నెలవారీ ఈఎంఐ కూడా రూ. 4,444 మాత్రమే పడుతుంది. కొనుగోలుదారులు ఆదాయ రుజువును చూపాల్సిన అవసరం లేదు. ప్రాసెసింగ్ రుసుము లేదా స్టాంప్ డ్యూటీని చెల్లించాల్సిన పనిలేదు. పూర్తి పేపర్‌లెస్ డిజిటల్ విధానంలో ఈ పథకాన్ని పొందవచ్చు. ఈ ఆఫర్ పూర్తి వివరాలు, దాని నిబంధనలు, షరతుల గురించి పూర్తి సమాచారం పొందడానికి ఆసక్తిగల కొనుగోలుదారులు తప్పనిసరిగా సమీపంలోని రివోల్ట్ డీలర్‌షిప్‌ను సంప్రదించాలి.

తగ్గింపు ధరలు..

రివోల్ట్ మోటార్స్ తన అమ్మకాలను పెంచుకోవడానికి, ఎలక్ట్రిక్ టూ వీలర్ల వినియోగాన్ని పెంచడానికి తరచూ ఇటువంటి పథకాలను విడుదల చేస్తూనే ఉంది. ఈ ఏడాది మే నెలలో అమలు చేసిన ఆఫర్ ప్రకారం ఆర్వీ400 స్టాండర్డ్, బీఆర్జెడ్ మోడళ్లపై రూ.5,000 ధర తగ్గింపును అందించింది. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల తయారీలో ఇన్‌పుట్ ఖర్చులను ఆప్టిమైజ్ చేయడం ద్వారా కంపెనీ ఆ ధరను తగ్గించగలిగింది. దీనికి అదనంగా ఇది రూ. 10,000 అదనపు తగ్గింపుతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్ కింద మరో రూ. 5,000 తగ్గింపు లభిస్తోంది.

రివోల్ట్ ఆర్వీ400 స్పెసిఫికేషన్స్..

రివోల్ట్ ఆర్వీ400 స్టాండర్డ్, బీఆర్జెడ్ మోడళ్లు రెండూ 3కేడబ్ల్యూ మోటార్ ను కలిగి ఉంటాయి. ఇది మార్చుకోగల 3.24కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. క్లెయిమ్ చేయబడిన పరిధి ఎకో మోడ్‌లో 150 కిమీ, సాధారణ మోడ్‌లో 100 కిమీ, స్పోర్ట్స్ మోడ్‌లో 80 కిమీ. ఈ బైక్ లో ఒక డిజిటల్ డిస్‌ప్లే, మూడు రైడ్ మోడ్‌లు, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ లేదా సీబీఎస్ని పొందుతుంది. అయితే దీనిలో పొందే ఫోన్ యాప్ కనెక్టివిటీ ఫీచర్‌ ఉండదు. ఈ రెండు ఇ-బైక్‌ల బ్యాటరీ ప్యాక్‌పై రివోల్ట్ 5 సంవత్సరాల, 75,000కిమీ వారంటీని అందిస్తుంది. ఈ ఆర్వీ400 బైక్స్ క్రటోస్ ఆర్, ఒబెన్ రోర్, మేటర్ బైక్ లకు పోటీగా మార్కెట్లో నిలబడుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..