Water Sprinkler Fan: వాటర్ స్ప్రింక్లర్ ఫ్యాన్‌.. AC వంటి చల్లటి గాలి కావాలంటే వెంటనే ఆర్డర్‌ చేసేయండి..

|

Mar 20, 2024 | 5:42 PM

తక్కువ బడ్జెట్‌లో లభించే AC వంటి గాలిని అందించగల సాధారణ టేబుల్ ఫ్యాన్ లేదా సీలింగ్ ఫ్యాన్ నుండి కొద్దిగా భిన్నంగా ఈ ఫ్యాన్ వాటర్ స్ప్రేతో చల్లని గాలిని అందిస్తుంది. దీనిని ఐస్ ఫ్యాన్ అని కూడా అంటారు. మార్కెట్లో అనేక రకాల వాటర్ స్ప్రింక్లర్ ఫ్యాన్లు అందుబాటులో ఉన్నాయి. ఇది నీటి బిందువులతో కలిసిన గాలిని అందిస్తుంది. ఇది వేడి గాలిని కూడా చల్లబరుస్తుంది. వాటర్ స్ప్రింక్లర్ ఫ్యాన్..

Water Sprinkler Fan: వాటర్ స్ప్రింక్లర్ ఫ్యాన్‌.. AC వంటి చల్లటి గాలి కావాలంటే వెంటనే ఆర్డర్‌ చేసేయండి..
Water Sprinkler Fan
Follow us on

Water Sprinkler Fan: మండుతున్న వేడి వల్ల అందరూ ఇబ్బంది పడతారు. ఈ రోజుల్లో అడపాదడపా వర్షాలు కురుస్తున్నప్పటికీ తేమతో కూడిన వేడి ప్రజలను చాలా ఇబ్బంది పెడుతోంది. తీవ్రమైన వేడి నుండి తప్పించుకునేందుకు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తుంటారు ప్రజలు. కానీ, ఇవన్నీ కరెంటు బిల్లుతో షాకిచ్చేవే. అలాగే సామాన్య ప్రజలు ఏసీలను కొనుగోలు చేయలేని పరిస్థితి.. మీరు కూడా వేడి, ఉక్కపోత కారణంగా ఇబ్బంది పడుతున్నట్టయితే, మీకు AC వంటి చల్లటి గాలిని అందించగల ప్రత్యేక ఫ్యాన్ గురించి మీకు చెప్పబోతున్నాము. అది కూడా చాలా తక్కువ విద్యుత్ ఖర్చుతో ఇది మీకు అందుబాటులోకి వస్తుంది. కాబట్టి దీని గురించి తెలుసుకుందాం.

ఈ మండు వేసవిలో ఫ్యాన్ మూడు, నాలుగు, ఐదులో వేసినా చల్లగాలి రావడం లేదని కొందరు వాపోతున్నారు. అందువల్ల, కూలర్, ఏసీ కొనుగోలు గురించి ఆలోచిస్తున్నప్పుడు బడ్జెట్ పెద్ద సమస్యగా మారుతుంది. వీటన్నింటి నుండి ఉపశమనం పొందడానికి వాటర్ స్ప్రింక్లర్ ఫ్యాన్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్రత్యేక ఫ్యాన్‌ చల్లటి నీటిని స్ప్రే చేస్తుంది. దాని కారణంగా దాని ముందు కూర్చున్న వ్యక్తికి ఎయిర్ కండీషనర్ నడుస్తున్నట్లు లేదా ఎవరైనా ఫ్రిజ్ తెరిచి ఉంచిన అనుభూతిని కలిగించేలా ఈ ఫ్యాన్ ఏసీ వంటి చల్లటి గాలిని అందిస్తుంది.

వాటర్ స్ప్రింక్లర్ ఫ్యాన్ అంటే ఏమిటి..?

ఇవి కూడా చదవండి

తక్కువ బడ్జెట్‌లో లభించే AC వంటి గాలిని అందించగల సాధారణ టేబుల్ ఫ్యాన్ లేదా సీలింగ్ ఫ్యాన్ నుండి కొద్దిగా భిన్నంగా ఈ ఫ్యాన్ వాటర్ స్ప్రేతో చల్లని గాలిని అందిస్తుంది. దీనిని ఐస్ ఫ్యాన్ అని కూడా అంటారు. మార్కెట్లో అనేక రకాల వాటర్ స్ప్రింక్లర్ ఫ్యాన్లు అందుబాటులో ఉన్నాయి. ఇది నీటి బిందువులతో కలిసిన గాలిని అందిస్తుంది. ఇది వేడి గాలిని కూడా చల్లబరుస్తుంది. వాటర్ స్ప్రింక్లర్ ఫ్యాన్..సాధారణ ఫ్యాన్ బ్లేడ్‌లను కలిగి ఉండటమే కాకుండా నీటి కుళాయికి కనెక్ట్‌ చేయబడి ఉంటుంది. ఇది నీటి షవర్ వంటి చిన్న చిన్న రంధ్రాలను కలిగి ఉంటుంది. వాటర్‌ ట్యాప్‌ ఆన్ చేసి, ఫ్యాన్‌ను ఆన్ చేస్తే, ఫ్యాన్‌ గాలితో పాటు చల్లటి నీరు పారుతుంది. స్ప్రింక్లర్ల సంఖ్యను మీ అవసరానికి అనుగుణంగా సర్దుబాటు చేయవచ్చు. కాబట్టి మీకు కావలసినంత చల్లటి గాలిని పొందవచ్చు.

లభ్యత:

ఈ వాటర్ స్ప్రింక్లర్ ఫ్యాన్ ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ వంటి ఈ.కామర్స్‌ వెబ్‌సైట్‌లలో మీకు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు కూడా మీకు అందుబాటులోనే ఉన్నాయి. సుమారు రూ.2 నుంచి రూ.3 వేల లోపుగానే ఇలాంటి వాటర్ స్ప్రింక్లర్ ఫ్యాన్‌ను మీ ఇంటికి తెచ్చుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..