Gas Cylinder Price: అంతర్జాతీయ మార్కెట్‌లో రేట్లకు అనుగుణంగా దేశీ మార్కెట్‌లో కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ ఉంటాయి. అయితే ఈనెలలో 19కిలోల సిలిండర్‌పై ధర పెరుగగా, 14.2 కిలోల సిలిండర్ ధరపై ఎలాంటి మార్పులు చేయలేదు చమురు సంస్థలు. ప్రస్తుతం 14.2 కిలోల సిలిండర్ ధర రూ. ఢిల్లీలో రూ.834.50, కోల్‌కతాలో రూ.861, ముంబైలో రూ.834.50, చెన్నైలో రూ.850.50, బెంగళూరులో రూ.837.50, హైదరాబాద్ రూ.887 ఉంది. ప్రతి నెల 1వ తేదీన గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తూ ఉంటాయి. ఒక వేళ ధర తగ్గవచ్చు.. లేదా పెరగొచ్చు. ఇక గత మూడు నెలలుగా సిలిండర్ ధరలను పరిశీలిస్తే.. తాజాగా ఈ ఆగస్టు 1న గ్యాస్ సిలిండర్ల ధర పెరిగింది. పెట్రోలియం, గ్యాస్ రిటైలింగ్ సంస్థలు 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను రూ.73.5 పెంచాయి. అయితే 14.2 కిలోల దేశీయ సిలిండర్ ధరలలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ పెరిగిన ధరలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈనెలలో పెరిగిన ధరలతో 19 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ.1623.00గా ఉంది. అలాగే, వాణిజ్య సిలిండర్ ధర ముంబైలో రూ.1579.50కు చేరుకుంది. కోల్ కతా, చెన్నైలో 19 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు వరుసగా రూ.1629.00, రూ.1761.00గా ఉన్నాయి. చమురు, గ్యాస్ కంపెనీలు ప్రతి నెలా 1వ తేదీన వంట గ్యాస్ ధరలను సవరిస్తాయి. సెప్టెంబర్ 1న మళ్లీ ధరలు పెంచుతాయా.? లేదా అనేది వేచి చూడాలి.
దేశీయ గృహ ఎల్‌పీజీ సిలిండర్ ధరలను ఆగస్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. గత నెల జూలై 1న ధరలను రూ.25.50 పెంచారు. జూలైలో ధరల పెరుగుదలతో 14.2 కిలోల దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ.834.50, ముంబైలో రూ.834.50, కోల్ కతాలో రూ.861, చెన్నైలో రూ.850.50, హైదరాబాద్‌లో రూ.887లుగా ఉంది. 2021లోనే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను రూ.138.50 వరకు పెంచారు.
ఇకపోతే జనవరి 1, 2021న 14.2 కిలోల దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.694 వద్ద ఉండేది. అంతేగాక, గత ఏడు సంవత్సరాలలో గ్యాస్ సిలిండర్ ధర రెట్టింపు అయింది. ఉదాహరణకు చెప్పాలంటే.. 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర 2014 మార్చి 1న రూ.410.50గా ఉంది. అయితే, ఇన్ని సంవత్సరాల్లో నిరంతర ధరల పెరుగుదలతో 14.2 కిలోల సిలిండర్ ధర ఇప్పుడు దేశ రాజధానిలో రూ.834.50కు చేరుకుంది. అలాగే గత ఏడాది డిసెంబర్ నెలలో రూ.610 ధర ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.710కు చేరుకుంది. తర్వాత ఈ ఏడాది మార్చి నెలలో రూ.835 ఉన్న 14.2 కిలోల సిలిండర్ ధర రూ.10 తగ్గింది. గత నెలలో రూ.25 పెరిగింది. ఈ నెలలో మాత్రం 14కిలోల సిలిండర్ ధరపై ఎలాంటి మార్పులు చేయలేదు చమురు సంస్థలు.
అయితే జూన్ నెలలో గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు భారీ ఊరట. జూన్ 1న శుభవార్త అందింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గింపు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐఓసీ వెబ్‌సైట్ ప్రకారం.. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.122 దిగొచ్చింది. దీంతో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1473కు తగ్గింది.
ఇకపోతే మే నెలలో కూడా గ్యాస్ సిలిండర్ ధర రూ.45 మేర తగ్గిన విషయం తెలిసిందే. ముంబైలో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.1422కు తగ్గింది. కోల్‌కతాలో కూడా సిలిండర్ ధర రూ.1544కు దిగొచ్చింది. చెన్నైలో కూడా ఇదే పరిస్థితి ఉంది. సిలిండర్ ధర రూ.1603కు తగ్గింది. ఇకపోతే 14 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం జూన్ నెలలో ఎలాంటి మార్పు లేదు.
ఇలా ప్రతి నెలలో ఎంతో కొంత పెరుగుదల కారణంగా సామాన్యులకు భారంగా మారుతోంది. ఒక వైపు పెట్రోల్, డీజిల్ ధరలతో సతమతమవుతున్న వాహనదారులకు.. నెలనెల సిలిండర్ ధరల పెరుగుదలతో మరింత భారీ మోపినట్లవుతుంది. ముందే నిత్యావసర ధరలు సైతం పెరిగిపోతున్నాయి. అందులో వీటి ధరలతో కూడా సామాన్యుడికి బతుకు భారంగా మారుతోంది.