గత కొన్ని నెలలుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ కావాలంటే వంద రూపాయలు పెట్టుకోవాల్సిందే. నిన్న పంజాబ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశంలోని కొన్ని కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు వ్యాట్ ధరలు పెంచుతుండటంతో ఇంధనం ధరలు ఖరీదైనవిగా మారుతున్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డిజిల్ ధరలు
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.72 ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.87.62గా ఉంది. ముంబైలో పెట్రోల్ ధర రూ.103.44 ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.89.97గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.95, డీజిల్ ధర లీటరుకు రూ.91.76గా ఉంది. బెంగళూరులో లీటరు పెట్రోల్ ధర రూ.102.86 ఉండగా, డీజిల్ ధర రూ.88.95 ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.100.85 ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.92.44గా ఉంది. అదే హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.41 ఉండగా, అదే డీజిల్ ధర లీటర్‌కు రూ.95.65 ఉంది. మీరు పెట్రోల్, డీజిల్ ధరలను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, ప్రభుత్వ ఎక్సైజ్ సుంకంలో మార్పులు, ప్రపంచ భౌగోళిక రాజకీయ సంఘటనలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొదలైన అనేక అంశాలపై పెట్రోల్, డీజిల్ ధరలలో హెచ్చుతగ్గులు ఆధారపడి ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి