Petrol-Diesel Price Today: బాదుడే.. బాదుడు.. రెండో రోజు పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Petrol-Diesel Price Today: గత కొన్ని రోజులుగా నిలకడగా ఉన్న పెట్రోల్‌, డీజిల్ ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల పుణ్యామాని పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగలేవు..

Petrol-Diesel Price Today: బాదుడే.. బాదుడు.. రెండో రోజు పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Updated on: Mar 23, 2022 | 7:40 AM

Petrol-Diesel Price Today: గత కొన్ని రోజులుగా నిలకడగా ఉన్న పెట్రోల్‌, డీజిల్ ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల పుణ్యామాని పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగలేవు. దాదాపు నాలుగున్నర నెలల తర్వాత మళ్లీ ధరలు ఎగబాకుతున్నాయి. రెండు రోజులు నుంచి పెట్రోల్‌ (Petrol), డీజిల్‌ Diesel Rates) ధరలు పెరగడం ప్రారంభమైంది. అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ (Crude Oil) ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో చమురు సంస్థలు ఇంధన ధరలను పెంచేశాయి. ఈ క్రమంలోనే తాజాగా బుధవారం ధరలను పెంచుతూ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ నిర్ణయం తీసుకుంది. వరుసగా రెండో రోజులు పెరిగాయి. తాజాగా లీటరు పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచాయి. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.110 ఉండగా, డీజిల్‌ ధర రూ.96.36కు చేరింది. నిన్న పెట్రోలు రూ.109.10, డీజిల్‌ రూ.95.50గా ఉన్నాయి.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌, డీజిల్‌పై 80పైసల వరకు పెరిగింది. దీంతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97,01 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.27గా ఉంది. అయితే మంగళవారం గ్యాస్‌ సిలిండర్‌ ధరలు కూడా పెరిగిన విషయం తెలిసింది. గతంలో కంటే రూ.50 అధికమవడంతో హైదరాబాద్‌లో 14 కిలోల ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.1002కు చేరింది.

ఇక ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.111.58 ఉండగా, డీజిల్‌ ధర రూ.95.74 ఉంది. అలాగే చెన్నైలో లీటర్ పెట్రోల్‌ ధర రూ.102.96 ఉండగా, డీజిల్‌ ధర రూ.92.99 ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.106.31 ఉండగా, డీజిల్‌ ధర రూ.91.42 వద్ద కొనసాగుతోంది.

గత ఏడాది నవంబర్‌లో పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రజలకు పెద్ద ఊరటనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నేరుగా పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ సమా దాదాపు అన్ని రాష్ట్రాలఉ పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాయి. ఆ తర్వాత నాలుగైదు నెలలుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మార్పు లేదు. తాజాగా రెండు రోజుల నుంచి మళ్లీ పరుగులు పెడుతున్నాయి ధరలు.

ఇక పెట్రోల్‌, డీజిల్‌ ధరలను కూడా SMS ద్వారా తెలుసుకోవచ్చు. మీ మొబైల్‌ నుంచి 9224992249 నెంబర్‌కు SMS పంపాలి. మీరు హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు తెలుసుకోవాలంటే RSP 134483 అని టైప్ చేసి 9224992249 ఫోన్ నెంబర్‌కు మెసేజ్‌ (Message) పపితే ధరల వివరాలు వస్తాయి.

ఇవి కూడా చదవండి:

Nitin Gadkari: పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. వాహనదారులకు కేంద్రం శుభవార్త.. భారీ ప్రణాళిక

Gold Silver Price Today: భారీగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు