భారతదేశంలో అమలులో ఉన్న అనేక చెల్లింపు వ్యవస్థలలో UPI ( యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) గత మూడు లేదా నాలుగు సంవత్సరాలలో బాగా ప్రాచుర్యం పొందింది . చిన్న మొత్తంలో లావాదేవీలు ఎక్కువగా UPI ద్వారా జరుగుతాయి. భారతదేశంలో డిజిటల్ విప్లవంలో కీలకమైన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ద్వారా యూపీఐ అభివృద్ధి జరిగింది. యూపీఐ స్కోప్, మోడ్‌లో మెరుగుదలలు, మార్పులు తరచుగా చేయబడుతున్నాయి. ఈరోజు (జనవరి 1) నుంచి కొన్ని ముఖ్యమైన మార్పులు అమలులోకి రానున్నాయి.
UPI లావాదేవీ పరిమితి పెంపు:
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ యూపీఐ లావాదేవీ పరిమితిని ఒక రోజులో రూ.1 లక్షకు పెంచింది. అంటే రోజుకు రూ.లక్ష వరకు లావాదేవీలు యూపీఐ ద్వారా చేయవచ్చు. అలాగే విద్య, ఆరోగ్యం కోసం యూపీఐ లావాదేవీల పరిమితిని రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచారు.
యూపీఐ మార్పిడి రుసుము:
ఆన్‌లైన్ వాలెట్‌ల వంటి ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాల ద్వారా చేసిన లావాదేవీలు, రూ.2000 కంటే ఎక్కువ ఉన్న నిర్దిష్ట వ్యాపారి యూపీఐ లావాదేవీల కోసం1.1% ఇంటర్‌చేంజ్ ఫీజు వసూలు చేస్తారు.
నాలుగు గంటల సమయ పరిమితి
అనుకోకుండా తప్పుడు యూపీఐ ఐడీ నంబర్‌కు డబ్బు పంపే వారి సంఖ్య పెరుగుతోంది. దీనిని నివారించడానికి యూపీఐ లావాదేవీలకు నాలుగు గంటల కాల పరిమితి విధించింది. ఒకే UPI IDతో చేసిన రూ. 2,000 కంటే ఎక్కువ మొదటిసారి నగదు బదిలీలకు ఇది వర్తిస్తుంది. అంటే, మీరు పంపిన డబ్బును ఉపసంహరించుకోవడానికి మీకు గరిష్టంగా 4 గంటల సమయం ఉంది.
యూపీఐ ఏటీఎం
ఏటీఎంలలో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి డబ్బు విత్‌డ్రా చేసుకునే సదుపాయం కల్పించారు. దేశంలోని అనేక ఏటీఎంలలో ఈ సదుపాయాన్ని అమలు చేయనున్నారు. దీంతో ఏటీఎంలో నగదు పొందేందుకు కార్డును ఉపయోగించాల్సిన అవసరం లేదు.
వాడని యూపీఐ ఐడీలు రద్దు
ఒక సంవత్సరానికి పైగా ఉపయోగించని యూపీఐ ఐడీలు, నంబర్లు రద్దు కానున్నాయి. Paytm, Google Pay, PhonePe మొదలైన చెల్లింపు యాప్‌లు, బ్యాంకులు NPCI ద్వారా నిర్దేశించబడ్డాయి. నేటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి