Free Ration: ఉచిత రేషన్ పంపిణీ ఈ నెలతో లాస్ట్.. డిసెంబర్‌ నుంచి నిలిపివేస్తారు..! ఎందుకో తెలుసుకోండి..

|

Nov 01, 2021 | 5:31 PM

Free Ration: కరోనా వైరస్ మొదటి వేవ్ సమయంలో దేశవ్యాప్తంగా పూర్తి లాక్డౌన్ విధించారు. దీనివల్ల దేశంలో చాలామంది ఉపాధి కోల్పోయారు. ఆర్థికంగా చితికిపోయారు.

Free Ration: ఉచిత రేషన్ పంపిణీ ఈ నెలతో లాస్ట్.. డిసెంబర్‌ నుంచి నిలిపివేస్తారు..! ఎందుకో తెలుసుకోండి..
Ration
Follow us on

Free Ration: కరోనా వైరస్ మొదటి వేవ్ సమయంలో దేశవ్యాప్తంగా పూర్తి లాక్డౌన్ విధించారు. దీనివల్ల దేశంలో చాలామంది ఉపాధి కోల్పోయారు. ఆర్థికంగా చితికిపోయారు. లాక్‌డౌన్‌ కారణంగా దినసరి కూలీల నుంచి చిరు వ్యాపారుల వరకు అందరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలామందికి పని లేకపోవడంతో తినడానికి తిండిలేని పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం స్పందించి “ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన”ను పథకాన్ని ప్రారంభించింది.

80 కోట్ల మంది PMGKY ప్రయోజనం పొందారు
ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKY) కింద భారతదేశంలోని దాదాపు 80 కోట్ల మంది రేషన్ కార్డ్ హోల్డర్లకు నెలకు 5 కిలోల ఆహార ధాన్యాలు (గోధుమ-బియ్యం) అందించారు. రేషన్ కార్డ్‌లో ఉన్న సభ్యులకు అతని కోటా రేషన్‌తో పాటు, ఈ పథకం కింద ప్రతి నెలా 5 కిలోల అదనపు రేషన్ అందించారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద లభించే ఈ రేషన్ పూర్తిగా ఉచితం. మహమ్మారి సమయంలో కోట్లాది మంది పేదలకు ఈ పథకం ఆహారం అందించింది.

ఈ ఏడాది దీపావళి వరకు పథకం అమలులో ఉంటుంది
ఈ పథకం కింద రేషన్ కార్డు హోల్డర్‌లోని ప్రతి సభ్యునికి కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా 5 కిలోల అదనపు గోధుమలు, బియ్యాన్ని అందజేసింది. ఈ సంవత్సరం మళ్ళీ రెండో వేవ్‌ వచ్చినప్పుడు మరోసారి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. దీంతో PMGKY 2.0 ప్రారంభమైంది. పథకం రెండవ దశ దీపావళి వరకు కొనసాగుతుంది అంటే నవంబర్ 4వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఈ పథకాన్ని మూసివేస్తారు. PMGKY మూసివేసిన తర్వాత దేశంలోని రేషన్ కార్డు హోల్డర్లందరికీ మునుపటిలాగే ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తారు.

Railway Job 2021: నిరుద్యోగులకు గమనిక..! రైల్వేలో 16000 పోస్టులకు నోటిఫికేషన్‌.. వెంటనే అప్లై చేయండి..

Viral Video: అడవి దున్నను చుట్టుముట్టిన సింహాలు.. ఇంతలో సీన్ రివర్స్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Viral Video: ఫేమస్ బ్యూటీషియన్‌లు కూడా పనికిరారు.. ఈ కోతి పని చూస్తే అవాక్కవ్వాల్సిందే..