మ్యాజిక్ కాదు నిజం.! జస్ట్ రూ. 2 లక్షలతో రూ.75 లక్షలు.. ఈ స్టాక్‌‌లతో కాలు కదపకుండా బ్రతికేయొచ్చు

చాలామంది స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేశామంటే.. కచ్చితంగా నష్టపోతామని అంటుంటారు. కొత్తగా మార్కెట్‌లోకి వచ్చేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? ఎలాంటి స్టాక్స్ ఎంచుకోవాలి.? ఇప్పుడు చూసేద్దాం.. ఓ వ్యక్తి తన రూ. 2.75 లక్షలను రూ. 75 లక్షలుగా ఎలా మార్చాడు అనేది కూడా తెలుసుకుందామా..

మ్యాజిక్ కాదు నిజం.! జస్ట్ రూ. 2 లక్షలతో రూ.75 లక్షలు.. ఈ స్టాక్‌‌లతో కాలు కదపకుండా బ్రతికేయొచ్చు
Multibagger Stock

Updated on: Jan 05, 2026 | 11:34 AM

స్టాక్ మార్కెట్‌లో 90 శాతం మంది ఎందుకు నష్టపోతున్నారు.? కొత్తగా మార్కెట్‌లోకి వచ్చేవారు ట్రేడింగ్ చేయాలా లేక ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా.? ఇలా అందరిలోనూ చాలా ప్రశ్నలు ఉంటాయి. వాస్తవానికి స్టాక్ మార్కెట్ అనేది ఒక వైకుంఠపాళీ. ఇందులో మనం ఇన్వెస్ట్ చేశామంటే.. కచ్చితంగా సహనంగా వేచి చూడాల్సిందే. మార్కెట్‌లో సంపదను సృష్టించాలంటే.. మన సహనాన్ని మనమే పరీక్షించుకోవాలి. అప్పుడే మనస్తత్వం, సంపద రెండూ వస్తాయి. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తన రూ. 2.75 లక్షల పెట్టుబడిని.. ఎలా రూ. 75 లక్షలు చేశాడో చూసేద్దాం.

వివరాల్లోకి వెళ్తే.. చాలామంది స్టాక్ మార్కెట్‌ను సులభంగా డబ్బు సంపాదించే మార్గంగా చూస్తారు. సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువగా నష్టపోతారు. మార్కెట్‌ను ఒక వ్యాపారంగా కాకుండా.. జూదంగా పరిగణనలోకి తీసుకుని.. స్వల్పకాలిక లాభాలపై దృష్టి పెట్టి.. భావోద్వేగాలకు లోనై తప్పుడు నిర్ణయాలు తీసుకుని కష్టాల్లో పడతారు. కొత్తగా మార్కెట్‌లోకి వచ్చేవారికి ఇన్వెస్ట్‌మెంట్ మార్గమే సరైనది. ఇన్వెస్ట్‌మెంట్ మనం చేస్తున్నామంటే.. కచ్చితంగా మార్కెట్ కదలికలు, స్టాక్ పనితీరు, కంపెనీల ఫలితాలు, ఆర్థిక వ్యవస్థ ప్రభావం లాంటివి అర్ధం చేసుకోవాలి. ఇక ట్రేడింగ్ విషయానికొస్తే.. అది మనకు సరిపోతుందా లేదా అని ఆలోచించుకోవాలి. ట్రేడింగ్‌లో సాంకేతిక అంశాలతో పాటు సైకాలజీ చాలా కీలకమని.. సెబీ నివేదికల ప్రకారం ట్రేడింగ్‌లో 90 శాతం మంది దారుణంగా విఫలమయ్యారని గుర్తు చేసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, ఆర్ధిక వ్యవస్థ ఫెయిల్యూర్స్ లాంటివి స్టాక్ మార్కెట్ తక్షణమే స్పందించేలా చేస్తాయి.

ఇక హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి కంపెనీలు దశాబ్దాల క్రితం చాలా తక్కువ ధరల్లో ఉండేవి. వీటిల్లో దీర్ఘకాలిక పెట్టుబడులు కంపెనీ వృద్ధి చెందుతున్న కొద్దీ పెరుగుతూపోతాయి. 2017-19 మధ్య ఓ వ్యక్తి తన కుమార్తె కోసం దాదాపు రూ. 2.75 లక్షలు డిక్సన్ టెక్నాలజీస్, లారస్ ల్యాబ్స్, హెడీఎఫ్‌సీ బ్యాంక్ లాంటి కంపెనీలలో పెట్టుబడి పెట్టాడు. అయితే కోవిడ్ సమయంలో మార్కెట్ క్రాష్ అవుతుందనుకుని.. వాటిని అమ్మేశాడు. అప్పుడు కొంత లాభాన్ని వెనకేసుకుని ఉన్నాడు. అయితే అవి ఇప్పటివరకు ఉంచితే.. కచ్చితంగా రూ. 75 లక్షల పోర్ట్‌ఫోలియోగా మారేది. దీన్ని డివిడెండ్, బోనస్, స్ప్లిట్ లాంటి అంశాలను కలిపితే.. భారీ మొత్తం రాబడిని లెక్కించవచ్చు. కాగా, ఎప్పుడూ కూడా మార్కెట్‌కు వ్యతిరేకంగా ‘రివెంజ్ ట్రేడింగ్’ చేసి, ఫ్యూచర్స్ పొజిషన్లను ఉంచుకోవడం వల్ల తీవ్ర నష్టాలు చూడవచ్చు. అలాంటి సమయాల్లో రిస్క్ మేనేజ్‌మెంట్, హెడ్జింగ్ చాలా అవసరం.

ఇవి కూడా చదవండి

గమనిక: షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. పెట్టుబడి పెట్టే ముందు దయచేసి మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. నష్టాలకు టీవీ9 బాధ్యత వహించదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి