సంపద సృష్టి రాత్రికి రాత్రే జరగదు. మీ జేబు డబ్బులో నుంచి కొంత భాగాన్ని ఆదా చేయడం నుండి తెలివిగా పెట్టుబడి పెట్టడం వరకు, ఈ రోజు వేసే ప్రతి అడుగు సురక్షితమైన సంపన్నమైన భవిష్యత్తుకు పునాది వేస్తుంది. కొంతమంది పొదుపు మీద ధ్యాస పెట్టరు. కానీ దీన్ని ముందుగానే ప్రారంభించడం, క్రమశిక్షణతో ఉండటం వంటివి మిమ్మల్ని ఇతరులకన్నా సంపద విషయంలో ముందుంచుతుంది. డబ్బు విషయంలో మీరు ఈ పొరపాట్లు చేస్తే అది మీకెప్పటికీ అందని ద్రాక్షే అవుతుంది.. అవేంటో చూడండి..
పెద్ద ఆదాయం ఉండి, స్థిరాస్తులు, వారసత్వ ఆస్తులు ఉన్నవారే డబ్బు సంపాదించగలరనేది వాస్తవం కాదు. సంపదను సృష్టించాలంటే అన్నింటికన్నా కీలకమైన వనరు ప్లానింగ్. ప్లానింగ్ ఉంటే చిన్న మొత్తం పొదుపుతో కూడా సురక్షితమైన భవిష్యత్తును పొందగలరు. పొదుపు అలవాటు చేసుకోవడం వల్ల కూడా ఆస్తులను కూడబెట్టుకోవచ్చు. అదెలాగో ఇందులో చూద్దాం..
పొదుపు అంటే ఇది ఒక విత్తనాన్ని నాటిన తర్వాత దానికి నీరు పోసి అది పెరిగే వరకు వేచి ఉండటం లాంటిది. కాలక్రమేణా చిన్న మొత్తాలను స్థిరంగా పొదుపు చేసే సాధారణ అలవాటు మంచి నిధిని నిర్మించడంలో సహాయపడుతుంది. పిల్లలు తమ పాకెట్ మనీలో కొంత భాగాన్ని పక్కన పెట్టుకున్నా లేదా పెద్దలు తమ నెలవారీ జీతంలోంచి కొంత మొత్తాన్ని తీసుకున్నా.. మీ సంపద సృష్టికి ఇది లైన్ క్లియర్ చేస్తుంది.
స్థిరత్వం ఉన్నప్పుడే సంపద సృష్టి జరుగుతుంది. ప్రతిరోజూ కొంత మొత్తాన్ని ఆదా చేస్తే అదే కాలక్రమేణా పెద్ద మొత్తాన్ని సంపాదించి పెడుతుంది. అంతేకాకుండా, పొదుపు చేయడానికి ఈ చేతన ప్రయత్నం విలువైన పొదుపు అలవాటును పెంపొందిస్తుంది, వృధా ఖర్చును నియంత్రిస్తుంది ఉత్పాదకంగా ఉపయోగించగల కార్పస్ సృష్టికి దారితీస్తుంది.
యూనియన్ బడ్జెట్ లాగే, ప్రతి వ్యక్తికి మెరుగైన ఆర్థిక ప్రణాళిక కోసం వారి స్వంత బడ్జెట్ ఉండాలి. పిల్లలు కూడా నెలవారీ బడ్జెట్‌ను తయారు చేసుకోవచ్చు అందులోనుంచే వారి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. ఇది వారి నెలవారీ ఖర్చులను ట్రాక్ చేయడానికి, వారు అనవసరమైన ఖర్చులు ఎక్కడ చేయాల్సి వస్తుందో గుర్తించడంలో వారికి సహాయపడుతుంది.
బడ్జెట్‌ను సిద్ధం చేయడానికి, పిల్లలు 50-30-20 నియమాన్ని వర్తింపజేయవచ్చు. వారు తమ డబ్బులో 50 శాతం తమ రవాణా, స్టేషనరీ మొదలైన అవసరాలకు, 30 శాతం స్నేహితులతో విహారయాత్రలకు లేదా వినోదం, షాపింగ్ వంటి ఖర్చులకు, 20 శాతం పొదుపు కోసం, అది వారి పిగ్గీ బ్యాంకులో, ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలో లేదా ఏదైనా ఇతర పెట్టుబడి ఎంపికలో అయినా కేటాయించవచ్చు.