Month End: నవంబర్‌ నెల ముగుస్తోంది.. డిసెంబర్‌ 1 నుంచి మారనున్న ఈ అంశాలపై ఓ లుక్కేయండి..

నవంబర్‌ నెల ముగియడానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఈ ఏడాదిలో చివరి నెలలోకి ఎంటర్‌ కాబోతున్నాం. డిసెంబర్‌ 1 నుంచి కొన్ని కీలక అంశాల్లో పలు మార్పులు జరగనున్నాయని. ఇందులో కొన్ని ధరలకు సంబంధించిన వివరాలు అయితే మరికొన్ని ఆర్థిక లావాదేవికి సంబంధించినవి...

Month End: నవంబర్‌ నెల ముగుస్తోంది.. డిసెంబర్‌ 1 నుంచి మారనున్న ఈ అంశాలపై ఓ లుక్కేయండి..
Month End

Updated on: Nov 26, 2022 | 4:18 PM

నవంబర్‌ నెల ముగియడానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఈ ఏడాదిలో చివరి నెలలోకి ఎంటర్‌ కాబోతున్నాం. డిసెంబర్‌ 1 నుంచి కొన్ని కీలక అంశాల్లో పలు మార్పులు జరగనున్నాయని. ఇందులో కొన్ని ధరలకు సంబంధించిన వివరాలు అయితే మరికొన్ని ఆర్థిక లావాదేవికి సంబంధించినవి. ఈ నెలఖారు నాటికి వచ్చే మార్పులు ఏంటి.? వాటికి ముందుస్తుగా ఎలా సంసిద్ధం కావాలన్న అంశాలపై ఓ లుక్కేయండి..

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెన్షన్‌ పొందుతున్న వ్యక్తులు ఏటా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి. పెన్షనర్లు ఈ సర్టిఫికేట్‌ను 30 నవంబర్ 2022లోపు సమర్పించాలి. దీని కోసం పెన్షనర్లు బ్యాంకు శాఖకు లేదా ఆన్‌లైన్‌లో వెళ్లి లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు. ఇప్పటి వరకు పొందుతోన్న పెన్షన్‌ ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలంటే నవంబర్‌ 30లోపు లైఫ్‌ సర్టిఫికేట్‌ సమర్పించాల్సి ఉంటుంది.

* ఇక వచ్చే నెలలో ఏకంగా 13 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. వీటిలో ప్రధానమైనవి నాల్గవ శనివారంతో పాటు ఆదివారాలు. అలాగే క్రిస్మస్‌తో పాటు కొన్ని ప్రాంతాల్లో స్థానిక పండగల నేపథ్యంలో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఈ సెలవులను దృష్టిలో పెట్టుకొని ప్లాన్‌ చేసుకుంటే మంచిది.

ఇవి కూడా చదవండి

* ఇక దేశవ్యాప్తంగా ప్రతి నెలా మొదటి రోజు లేదా మొదటి వారంలో సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలను సవరిస్తుంటారు. నెల మొదటి వారంలో ధరలు పెరగడం, లేదా తగ్గడం జరుగుతుంటుంది. అయితే పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నెలఖారులోపు కొనుగోలు చేసే ఆలోచన ఉంటే చేసుకోండి.

* ఇక ప్రతి నెల 1వ తేదీన ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను నిర్ణయిస్తుంటారు. గత నెలలో వాణిజ్య సిలిండర్‌పై కేంద్రం ధరల తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నెలలో కూడా ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి మరో నాలుగు రోజులు వేచి చూస్తే తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం పొందొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..