ఆధార్ కార్డు.. భారతీయులకు అత్యంత ముఖ్యమూన డాక్యూమెంట్. ఏదైనా ప్రభుత్వ పథకం ప్రయోజనాలను పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ జారీ చేసే సంస్థ అయిన భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యుఐడీఏఐ), ఆధార్‌లో నమోదు చేయబడిన సమాచారాన్ని అప్‌డేట్ చేయమని ఎప్పటికప్పుడు అడుగుతోంది. కోట్లాది మంది ఆధార్ వినియోగదారులలో ఆధార్ అప్‌డేట్‌ను ప్రోత్సహించడానికి యుఐడీఏఐ ఉచిత ఆధార్ ఆప్‌డేట్ సౌకర్యాన్ని ప్రారంభించింది. యుఐడీఏఐ జూన్ 14 వరకు ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసే సదుపాయాన్ని అందిస్తోంది. ఆ తర్వాత 3 నెలల పాటు సెప్టెంబర్ 14, 2023 వరకు పొడిగించబడింది.
మీరు కూడా ఎటువంటి రుసుము లేకుండా ఆధార్‌ను అప్‌డేట్ చేయాలనుకుంటే.. మీకు చివరి అవకాశం ఉంది. వెంటనే అప్‌డేట్ చేసుకోండి. దీంతో మీరు ఫైన్ పడకుండా జాగ్రత్త పడొచ్చు. అయితే మనలో చాలా మందికి ఆధార్‌ను ఎలా అప్‌డేట్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.. అందు కోసం ముందుగా ఇలా చేయండి.
ఆధార్ జారీ చేసే సంస్థ అయిన యుఐడీఏఐ, ఆధార్ సృష్టించి 10 ఏళ్లు దాటిన ఆధార్ వినియోగదారులందరినీ అప్రమత్తం చేసింది. సంస్థ ప్రకారం, 10 సంవత్సరాలకు పైగా ఆధార్‌ను నవీకరించని వారు ఈ పనిని పూర్తి చేయాలి. ఇందులో అడ్రస్, మొబైల్ నంబర్ తదితర వివరాలను ఎలాంటి ఛార్జీ లేకుండా మార్చుకోవచ్చు.
విశేషమేంటంటే, మీరు కూడా ఉచితంగా ఆధార్ అప్‌డేట్ సౌకర్యాన్ని పొందాలనుకుంటే.. ఈ పనిని ఆన్‌లైన్‌లో చేయండి. ఆఫ్‌లైన్ ఆధార్ కేంద్రానికి వెళ్లి ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయడానికి మీరు రుసుము చెల్లించాలి. ఉచిత సౌకర్యాన్ని పొందడానికి, మై ఆధార్ పోర్టల్‌కి వెళ్లండి. ఈ పోర్టల్ ద్వారా ఆధార్‌ను అప్‌డేట్ చేసిన తర్వాత, మీరు ఉచితంగా ఆధార్‌ను అప్‌డేట్ చేసుకునే సదుపాయాన్ని పొందుతారు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం