Forgot ATM Card: డెబిట్‌ కార్డు లేకుండా ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేయడం ఎలా? మొబైల్‌ ఉంటే చాలు

|

Nov 29, 2022 | 9:23 PM

Forgot ATM Card: ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది. ఏటీఎం నుంచి డబ్బులు ఉపసంహరణ చేసుకునేందుకు సులభమైన మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఒక్కోసారి..

Forgot ATM Card: డెబిట్‌ కార్డు లేకుండా ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేయడం ఎలా? మొబైల్‌ ఉంటే చాలు
ATM
Follow us on

Forgot ATM Card: ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది. ఏటీఎం నుంచి డబ్బులు ఉపసంహరణ చేసుకునేందుకు సులభమైన మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఒక్కోసారి ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేయాలంటే డెబిట్‌ కార్డు తప్పనిసరి కావాల్సిందే. కానీ టెక్నాలజీ కారణంగా బ్యాంకులు కొత్త సర్వీలను ప్రవేశపెడుతోంది. ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేయాలంటే డెబిట్‌కార్డు ఉండాల్సిన అవసరం లేదు. కేవలం ఫోన్‌ ఉండే చాలు డబ్బులు తీసుకునే సదుపాయం వచ్చేసింది. ఇందు కోసం యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) మద్దతు ఇస్తోంది. ఇప్పటికే కార్డ్ రహిత లావాదేవీలు, కొనుగోళ్లతో మన జీవితాలను సులభతరం చేసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీఐసీ) యూపీఐని అమలు చేయడం ద్వారా వినియోగదారులు యూపీఐ ద్వారా ఏటీఎంల నుండి నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇంటర్‌ఆపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రావల్ (ఐసిసిడబ్ల్యు) అనే ఫీచర్ ద్వారా కస్టమర్లు కార్డ్‌లను తీసుకెళ్లకపోయినా ఎటిఎంల నుండి డబ్బు తీసుకోవడానికి అనుమతిస్తుంది.

క్లోనింగ్, స్కిమ్మింగ్, డివైజ్ ట్యాంపరింగ్‌తో సహా కార్డ్ మోసాలను నిరోధించడానికి ఇలాంటి ఆప్షన్‌ను అందించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను కోరింది. కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణ సదుపాయం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏటీఎంలలో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. గూగుల్‌ పే (GooglePay), పోన్‌పే (PhonePe), పేటీఎం (Paytm) ఇతర యాప్‌ల ద్వారా యూపీఐ సేవలను ఉపయోగించి నగదు ఉపసంహరణ సౌకర్యాన్ని పొందవచ్చు. ఇలా యూపీఐ ద్వారా డబ్బులు విత్‌డ్రా చేసుకున్నందుకు బ్యాంకులు ఎలాంటి రుసుము వసూలు చేయవు.

యూపీఐని ఉపయోగించి విత్‌డ్రా చేయడం ఎలా?

1. ఏదైనా ఏటీఎం మెషీన్‌ని సందర్శించి, స్క్రీన్‌పై ‘విత్‌డ్రా క్యాష్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

ఇవి కూడా చదవండి

2. తర్వాత యూపీఐ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

3. మీ ఏటీఎం స్క్రీన్‌పై క్యూఆర్‌ కోడ్ ప్రదర్శించబడుతుంది.

4. ఇప్పుడు మీ ఫోన్‌లో యూపీఐ యాప్‌ని తెరిచి, ఏటీఎం మెషీన్‌లో ప్రదర్శించబడే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్ చేయండి.

5. మీరు విత్‌డ్రా చేయాలనుకుంటున్న డబ్బును నమోదు చేయండి. మీరు రూ.5000 వరకు నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు.

6. యూపీఐ పిన్‌ని నమోదు చేసి, ‘హిట్ ప్రొసీడ్’ బటన్‌ను నొక్కండి.

7. మీరు ఏటీఎం మెషీన్ నుండి మీ నగదును తీసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి