Indian Railways: రైల్వే ప్రయాణికులందరికి అలర్ట్.. టికెట్ల బుకింగ్ రూల్స్‌లో భారీ మార్పులు.. ఇకపై ఈ సమయాల్లోనే అవకాశం

IRCTC Ticket Booking: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. రైల్వే టికెట్ల బుకింగ్ రూల్స్ పూర్తిగా మారాయి. జనరల్ టికెట్ బుక్ చేసుకోవాలన్నా ఆథార్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐఆర్‌సీటీలో ఆధార్ ఆథెంటిఫికేషన్ చేసుకున్నవారికి మాత్రమే టికెట్లు బుక్ అయ్యేలా రైల్వేశాఖ కొత్త మార్పులు చేస్తోంది.

Indian Railways: రైల్వే ప్రయాణికులందరికి అలర్ట్.. టికెట్ల బుకింగ్ రూల్స్‌లో భారీ మార్పులు.. ఇకపై ఈ సమయాల్లోనే అవకాశం
Railway Tickets

Updated on: Jan 07, 2026 | 1:36 PM

దేశవ్యాప్తంగా లక్షల మంది తరచూ రైళ్లల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. దీంతో రైళ్లల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎక్కువమంది ముందుగానే టికెట్ బుక్ చేసుకుని సౌకర్యవంతమైన ప్రయాణం చేస్తారు. టికెట్ బుక్ చేసుకోవాలంటే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్లోకి వెళ్లడం తప్పనిసరి. ఏ ఫ్లాట్‌ఫామ్‌లో టికెట్ బుక్ చేసుకోవాలన్నా ఐఆర్‌సీటీసీ లాగిన్స్ అనేవి తప్పనిసరిగా కలిగి ఉండాలి. లేకపోతే మనం రైల్వే టికెట్లు బుక్ చేసుకోలేము. టికెట్ల బుకింగ్‌కు సంబంధించి రైల్వేశాఖ ఎప్పటికప్పుడు నూతన మార్పులు తీసుకొస్తుంది. టికెట్ల అక్రమాలు, అవకతవకలకు చెక్ పెట్టి పారదర్శకత తెచ్చేందుకు రైల్వేశాఖ ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి చేసింది. అంటే టికెట్ బుక్ చేసుకోవాలంటే ఆథార్ అథెంటిఫికేషన్ చేయాల్సి ఉంటుంది.

ఆధార్ వెరిఫికేషన్ చేసుకోకపోతే

టికెట్ల దర్వినియోగాన్ని అడ్డుకునేందుకు బుకింగ్‌లకు ఆధార్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. గత ఏడాది అక్టోబర్ 1 నుంచి జనరల్ టికెట్ రిజర్వేషన్లకు ఈ ప్రక్రియ తప్పనిసరి చేశారు. గతంలో ఐఆర్‌సీటీసీ ఫ్లాట్‌ఫామ్‌లో ఆధార్ లింక్ చేసినవారు మాత్రమే తొలి 15 నిమిషాల్లో టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం కల్పించారు. ఆ తర్వాత గత ఏడాది డిసెంబర్ 29 నుంచి ఆధార్ వెరిఫికేషన్ చేసుకున్నవారికి మాత్రమే ఉదయం 8 నుంచి 12 గంటల వరకు టికెట్లు బుక్ అయ్యేలా రూల్స్ తీసుకొచ్చారు. అయితే 2026 జనవరి 5 నుంచి ఈ సమయాన్ని మరింత పొడిగిస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఆథార్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసినవారు టికెట్ బుక్ చేసుకోవచ్చని రైల్వేశాఖ స్పష్టం చేసింది.

జనవరి 12 నుంచి పెరగనున్న సమయం

ఇక జనవరి 12 నుంచి ఐఆర్‌సీటీలో ఆథార్ ఆథెంటిఫికేషన్ చేసుకున్నవారు టికెట్లు బుక్ చేసుకునే సమయం మరింత పెరగనుంది. జనవరి 12 నుంచి సమయాన్ని 14 గంటలకు పెంచారు. అంటే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు చేసుకోవచ్చన్నమాట. ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ వల్ల టికెట్లు దుర్వినియోగం కావడం లేదని, పారదర్శకత వస్తుందని రైల్వేశాఖ చెబుతోంది. అటు తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు కూడా ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవడం తప్పనిసరి. టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఆధార్ ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే తత్కాల్ టికెట్లు బుక్ అవుతాయి.