Online Shopping: మీరు ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి

|

Apr 23, 2021 | 12:20 PM

Online Shopping: ప్రస్తుతం డిజిటల్‌ యుగతంలో ప్రతి ఒక్కరు కూడా ఆన్‌లైన్‌కే అలవాటు పడుతున్నారు. ప్రతి ఒక్కరు ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేయడం అనేది సాధారణంగా మారిపోయింది..

Online Shopping: మీరు ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి
Online Shopping
Follow us on

Online Shopping: ప్రస్తుతం డిజిటల్‌ యుగతంలో ప్రతి ఒక్కరు కూడా ఆన్‌లైన్‌కే అలవాటు పడుతున్నారు. ప్రతి ఒక్కరు ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేయడం అనేది సాధారణంగా మారిపోయింది. అయితే ఆన్‌లైన్‌లో షాపింగ్‌లు చేస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు తలెత్త ప్రమాదం ఉందని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఈ మధ్య కాలంలో నకిలీ వెబ్‌సైట్లు చాలా పుట్టుకొస్తున్నాయి. నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి వివిధ ఆఫర్ల అంటూ కస్టమర్లను నమ్మించి మోసం చేస్తున్నారు కూడా ఉన్నారు. ఆన్‌లైన్‌లో ఒక ప్రొడక్ట్స్‌ను చూపించి డెలివరి చేసే సమయంలో నాణ్యత లేకుండా నకిలీ వస్తువులను డెలివరి చేసిన సందర్భాలు కూడా ఉంటున్నాయి. అందుకే ఏదైనా వస్తువులను ఆర్డర్‌ చేస్తే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ తదితర మంచి పేరున్న సైట్ల నుంచి ఆర్డర్‌ చేస్తే మంచిది. అలాంటి వారు వస్తువుల్లో ఏదైనా పొరపాటు జరిగితే రిటన్‌ తీసుకుని క్యాష్‌బ్యాక్‌ను అందిస్తారు. లేదా నాణ్యతమైన వస్తువులను అందిస్తారు.

వెబ్‌సైట్‌ కంపెనీ

ఆకర్షణీయమైన బట్టలు లేదా ఇతర ప్రొడక్ట్స్‌ ఫోటోలు చూపిస్తూ సోషల్‌ మీడియాలో అనేక ప్రకటనలు కనిపిస్తూ ఉంటాయి. అయితే అలాంటి వెబ్‌సైట్‌ యొక్క రిజిస్టర్‌ కార్యాలయం రునామా, ల్యాండ్‌లైన్‌ నెంబర్‌, ఇతర సమాచారారాన్ని తనిఖీ చేయడం ముఖ్యం. ఏ కంపెనీ వెబ్‌ సైట్‌లోనైనా వారి పూర్తి సమాచారం కనిపించకపోతే అలాంటి సైట్‌ నుంచి షాపింగ్‌ చేయవద్దంటున్నారు.

క్యాష్‌ అన్‌ డెలివరీ :

ఇటీవల అనేక కొత్త కొత్త కంపెనీలు వివిధ పేర్లతో ఆన్‌లైన్‌ షాపింగ్‌లోకి దిగుతున్నాయి. ఇంటర్‌నెట్‌ ఆకర్షనీయమైన ఆపర్లతో ప్రకటనలు గుప్పిస్తున్నాయి. అయితే అలాంటి వాటిని నమ్మడం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించాక.. ఆయా కంపెనీలు డెలివరీ చేయకుండా మోసం చేసే ప్రమాదం కూడా ఉంది. అందుకే కొత్త సైట్‌ల నుంచి ఏదైనా ఆర్డర్‌ చేస్తే క్యాష్‌ అండ్‌ డెలివరి (COD) ఆప్షన్‌ ఎంచుకుంటే మంచిది. ఒక వేళ వారు ఈ ఆప్షన్‌ ఇవ్వకపోతే అలాంటి సైట్ల జోకికి వెళ్లకపోవడం మంచిది.

వస్తువుల్లో నాణ్యత – వారంటీ:

డిస్కౌంట్లను చూసి అనేక మంది నాణ్యత లేని వస్తువులను కొనుగోలు చేసి మోసపోతుంటారు. దీంతో ఏదైనా వస్తువులను కొనే ముందు దాని రివ్యూలు, రేటింగ్‌లు చూడటం, దాని గురించి ఆన్‌లైన్‌లో వెతకడం మంచిది. తక్కువ ధర ఉంది కదా అని కొనుగోలు చేస్తే నాణ్యత లేకుండా ఉంటాయి. అలాగే ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే సమయంలో ఏసీ, టీవీ, ఫ్రిజ్‌, మైక్రోవేవ్‌ తదితర ఎలక్ట్రానిక్‌ వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు తప్పనిసరిగా వారంటీని చూడాలి. మంచి నాణ్యతతో ఎక్కువ కాలం వారంటీ అందించే వస్తువులనే కొనుగోలు చేయడం ఉత్తమం.