
ప్రస్తుతం కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ఓవైపు కొత్త కార్లతో పాటు పాత కార్లకు సైతం డిమాండ్ పెరిగింది. మరీ ముఖ్యంగా కరోనా తదనంతర పరిస్థితుల నేపథ్యంలో దేశంలో సొంత కార్లు ఉండాలనుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అలాగే పాత కార్లను అమ్మేవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. అయితే పాత కారును అమ్మే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇలాంటివి పాటించడం ద్వారా మీ పాత కారును ఎక్కువ మొత్తానికి సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ పాత కారు అమ్మే సమయంలో ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
* ఎవరైనా కారు కొనుగోలు చేయాలనుకునే సమయంలో మొదట చూసేది కారు శుభ్రంగా ఉందా లేదా అని. కారు చూడడానికి ఆకర్షణీయంగా కనిపిస్తే కాస్త ధర ఎక్కువైనా పర్లేదు కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. అందుకే కారును సేల్ చేసే ముందు ఏవైనా డెంట్స్ ఉంటే వాటిని కనిపించకుండా చెయ్యాలి.
* ఇక కారు ఇంజన్ అంతా పర్‌ఫెక్ట్‌గా ఉండి కలర్ షేడ్ అయినా కొనుగోలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. అందుకే కారును క్లీనింగ్ పాలిషింగ్ చేయించాలి. ఇలా చేయడం వల్ల కూడా కారుకు ఎక్కువ ధర వచ్చే అవకాశాలు ఉంటాయి.
* ఇక కారును విక్రయించే ముందు కచ్చితంగా పూర్తిగా సర్వీసింగ్ చేయించండి. దీంతో చిన్న చిన్న సమస్యలు ఏవైనా ఉంటే సాల్వ్ అవుతాయి. కారు కొనుగోలు చేసే సమయంలో కస్టమర్ ఇలాంటి తప్పులను గుర్తిస్తే కారును తక్కువ ధరకు అడిగే అవకాశం ఉంటుంది. కస్టమర్ కారు టెస్ట్ డ్రైవ్ చేసే సమయంలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలి.
* ఇక పాత కారు కొనుగోలు చేసే సమయంలో కచ్చితంగా చూసే అంశం డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయా లేదా కూడా చూసుకోవాలి. సెకండ్ హ్యాండ్ కారుకు ఫైనాన్స్ రావాలంటే కచ్చితంగా సరైన పేపర్ ఉండాలి. అందుకే డాక్యుమెంట్లు సరిగా ఉన్న కారును కొనడానికే చాలామంది ఆసక్తి చూపుతారు. అందుకే మీ కారును అమ్మడానికి ముందే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్, సర్వీస్ హిస్టరీ, పొల్యూషన్ సర్టిఫికేట్ వంటి అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..