
Aadhar Card Update: ఆధార్ కార్డు ఈ రోజుల్లో ఎంత ముఖ్యమైన డాక్యుమెంట్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దానితో ఎప్పుడు ఏ అవసరం పడుతుందో చెప్పలేం. అందుకే ఎల్లప్పుడూ మన పాకెట్‌లో ఉంచుకోవాల్సి వస్తుంది. ఏ పనికైనా ఆధార్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో అది లేకుండా ఏ సర్వీస్ కూడా పొందలేనంతగా పరిస్థితి మారిపోయింది. ఇండియాలో నివసించే ప్రతీఒక్కరికీ ఆధార్ అత్యంత ముఖ్యమైన ధృవీకరణ పత్రంగా ఉంది. కేవలం గుర్తింపు కోసమే కాకుండా ప్రభుత్వ పథకాలు, ఇన్‌కమ్ ట్యాక్స్, పీఎఫ్, బ్యాంక్ సర్వీసులను పొందటానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్‌ను మీరు పొగోట్టుకుంటే ఏం చేయాలి? ఆధార్ నెంబర్ కూడా గుర్తులేని పరిస్థితుల్లో ఎలా తిరిగి పొందాలి? అనే విషయాలు చూద్దాం.
ఆధార్ కార్డును ఎక్కడ బడితే అక్కడ పడేసి పొగోట్టుకుంటూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో కనీసం ఆధార్ నెంబర్ కూడా గుర్తు లేదనుకుందాం. ఇలాంటి పరిస్థితి మీకు ఎదురైనప్పుడు తిరిగి ఆధార్ నెంబర్ లేదా ఆధార్ కార్డును మీరు పొందవచ్చు. ఇందుకోసం మీరు UIDAI వెబ్‌సైట్‌ను సందర్శించి సులభంగా ఆధార్‌ను తీసుకోవచ్చు. కానీ ఆధార్ కార్డుతో మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి.
-UIDAI వెబ్‌సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేయండి.
-మీ భాషను ఎంచుకోండి
-మెయిల్ ట్యాబ్‌లో Retrieve Aadhaar number/EID/SID అనే ఆప్షన్‌ను ఎంచుకండి
-ఆ తర్వాత మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్, క్యాప్చా ఎంటర్ చేసి ఓటీపీ ట్యాబ్‌పై క్లిక్ చేయండి
-ఓటీపీ ఎంటర్ చేసి మీ ఆధార్ నెంబర్ మీకు ఎస్‌ఎంఎస్ ద్వారా వస్తుంది.
-ఆ నెంబర్ ద్వారా మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఒకవేళ ఆధార్ కార్డులో మీ మొబైల్ నెంబర్ లింక్ కాకపోతే మీకు ఎస్‌ఎంఎస్ రాదు. ఇలాంటి సమయాల్లో హెల్ప్ లైన్ నెంబర్ 1947కు కాల్ చేయండి. అక్కడి వచ్చే సూచనలను పాటించండి.
ఇక సమీపంలోని ఆధార్ సెంటర్‌ను సందర్శించి మీరు నెంబర్‌ను తిరిగి పొందవచ్చు. ఆధార్ ప్రింట్ కోసం మీరు రిక్వెస్ట్ చేస్తే సిబ్బంది అందిస్తారు. దీనికి మీరు ఎలాంటి ఛార్జీ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.