E PAN: అర్జెంట్‌గా పాన్‌ కార్డ్‌ అవసరమా.? రెండు నిమిషాల్లో ఈ-పాన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి..

|

Jan 21, 2024 | 8:38 PM

అయితే పాన్ కార్డ్‌ను అప్లై చేసుకున్న తర్వాత కనీసం రెండు వారాల తర్వాతే పాన్‌ చేతుకి అందుతుంది. కొన్ని సందర్భాల్లో నెల రోజులు కూడా పడుతుంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఈ ఆధార్‌ కార్డ్‌ను క్షణాల్లో ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పీడీఎఫ్ ఫైల్ రూపంలో...

E PAN: అర్జెంట్‌గా పాన్‌ కార్డ్‌ అవసరమా.? రెండు నిమిషాల్లో ఈ-పాన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి..
E Pan Card
Follow us on

పాన్‌ కార్డ్‌ ఎంత అనివార్యంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్థిక లావాదేవీలకు పాన్‌ కార్డ్‌ ఉండాల్సిందే. ఆధార్‌ కార్డ్‌ తర్వాత అత్యంత ముఖ్యమైన వాటిలో పాన్‌ కార్డ్‌ ఒకటని తెలిసిందే. దేశంలో ప్రతి పౌరుడి, సంస్థల ట్యాక్సేషన్ కోసం ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డును జారీ చేస్తుంది. బ్యాంకుల్లో ఒకేసారి రూ. 50 వేల నగదు డిపాజిట్‌ చేయాలన్నా, ఇన్‌కం ట్యాక్స్‌ రిటర్న్స్‌ ఫైల్‌ చేయాలన్నా పాన్‌ కార్డ్‌ ఉండాల్సిందే.

అయితే పాన్ కార్డ్‌ను అప్లై చేసుకున్న తర్వాత కనీసం రెండు వారాల తర్వాతే పాన్‌ చేతుకి అందుతుంది. కొన్ని సందర్భాల్లో నెల రోజులు కూడా పడుతుంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఈ ఆధార్‌ కార్డ్‌ను క్షణాల్లో ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పీడీఎఫ్ ఫైల్ రూపంలో దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సాధారణ పాన్ కార్డులాగే దీన్ని కూడా అన్ని ఆర్థిక లావాదేవీలకు ఉపయోగించుకోవచ్చు. ఇంతకీ ఈ పాన్‌ కార్డును ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలో స్టెప్‌ బై స్టెప్‌ ప్రాసెస్‌ ఇప్పుడు తెలుసుకుందాం..

* ఇందుకోసం ముందుగా.. ఇన్ కమ్ ట్యాక్స్ అధికారిక పోర్టల్ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

* అనంతరం స్క్రీన్‌కి లెఫ్ట్‌ సైడ్‌ కనిపించే.. ఆప్షన్స్‌లో ‘ఇన్ స్టాంట్ ఈ-పాన్ ‘ బటన్ పై క్లిక్ చేయాలి.

* తర్వాత గెట్‌ న్యూ పాన్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిని సెలక్ట్ చేసుకోవాలి.

* అనంతరం ఆధార్ నంబర్ ను ఎంటర్ చేసి, చెక్ బాక్స్ పై టిక్ చేసి పై క్లిక్ చేసి కంటిన్యూ బటన్ పై క్లిక్ చేయాలి.

* వెంటనే మీ రిజిస్టర్ ఫోన్‌ నెంబర్‌కు ఓటీపీ వెళ్తుంది. దానిని ఎంటర్‌ చేసి కంటిన్యూ నొక్కాలి.

* తర్వాత ఆధార్ వివరాలను చెక్‌ చేసిన తర్వాత టర్మ్స్‌ను యాక్సెప్ట్ చేస్తూ చెక్‌ బాక్స్‌పై టిక్ చేయాలి.

* వెంటనే ఇన్‌స్టాంట్‌గా ఈ పాన్‌ కార్డ్‌ వస్తుంది. పీడీఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..