Investment Plans: ఆ పథకాల్లో పెట్టుబడితో రాబడి వరద.. ఎఫ్‌డీ కంటే మెరుగైన స్కీమ్స్ ఇవే..!
ఆర్‌బీఐ ఐదు సంవత్సరాల్లో మొదటిసారిగా రెపో రేటును తగ్గించడంతో ప్రభుత్వ రంగ బ్యాంకులతో సహా అనేక బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించాయి. దేశంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ ప్రజలు ముఖ్యంగా ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు మెరుగైన పెట్టుబడి ఎంపికగా పరిగణిస్తారు. చాలా ఏళ్లుగా దేశంలో ఎఫ్‌డీల ద్వారా అధిక వడ్డీ రేట్లను పొందుతున్నారు.

తాజాగా చాలా బ్యాంకులు తమ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను తగ్గించడంతో ప్రారంభించినందున చాలా మంది పెట్టుబడిదారులు ఇప్పుడు మెరుగైన రాబడిని పొందడానికి ఇతర పెట్టుబడి మార్గాలను అన్వేషిస్తున్నారు. మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే మెరుగైన రాబడి కోసం చూస్తుంటే మీకు అనేక గొప్ప ఎంపికలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎఫ్‌డీ స్కీమ్స్ భద్రత, స్థిర వడ్డీని అందిస్తాయి కానీ దాని వడ్డీ రేట్లు తరచుగా ద్రవ్యోల్బణాన్ని అధిగమించడంలో విఫలమవుతాయని చెబుతున్నారు. అందుకే పెట్టుబడిదారులకు ఇప్పుడు మెరుగైన రాబడిని ఇచ్చే, అలాగే రిస్క్‌ను సమతుల్యంగా ఉంచే ఎంపికలు అవసరమని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎఫ్‌డీల కంటే అధిక రాబడినిచ్చే పథకాలపై ఓ లుక్కేద్దాం.
పొదుపు ఖాతాలు
మీరు ఫిక్స్‌డ్ డిపాజిల్ల కంటే మెరుగైన వడ్డీ రేట్లు పొందాలనుకుంటే, అలాగే పూర్తి లిక్విడిటీని కొనసాగించాలనుకుంటే చిన్న ఫైనాన్స్ బ్యాంకులలో పొదుపు ఖాతాలు మంచి ఎంపిక కావచ్చు. ఈ బ్యాంకులు 7 శాతం వరకు వడ్డీని అందిస్తాయి, ఇది సాంప్రదాయ బ్యాంకుల కంటే చాలా ఎక్కువ. అయితే వీటిల్లో డిపాజిట్లపై రూ. 5 లక్షల వరకు డీఐసీజీసీ ద్వారా బీమా రక్షణ కూడా ఉంటుంది. అయితే ఈ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు కాలానుగుణంగా మారవచ్చు.
పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు
మీ పెట్టుబడిపై మీకు పూర్తి భద్రత, ప్రభుత్వ హామీ కావాలంటే పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఉత్తమ ఎంపికలుగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ స్కీమ్ ద్వారా సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా చేసుకోవచ్చు.
ప్రభుత్వ బాండ్లు, ఆర్‌బీఐ బాండ్లు
మీరు పూర్తి భద్రతతో ఎఫ్‌డీ కంటే మెరుగైన వడ్డీని కోరుకుంటే ప్రభుత్వ బాండ్లు, ఆర్‌బీఐ బాండ్లు సరైన ఎంపికగా ఉంటాయి. అవి చాలా కాలం పాటు స్థిరమైన రాబడిని ఇస్తాయి. ప్రభుత్వ హామీతో సురక్షితమైన పెట్టుబడిగా ఉంటుంది. ఎఫ్‌డీ కంటే మెరుగైన వడ్డీ రేటు ఉంటుంది.
స్టాక్స్‌లో పెట్టుబడి
మీరు కొంచెం రిస్క్ తీసుకొని క్రమం తప్పకుండా ఆదాయం పొందాలనుకుంటే, డివిడెండ్ చెల్లించే బ్లూ-చిప్ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడం మంచి ఎంపిక కావచ్చు. స్టాక్ ధర పెరిగితే మూలధన పెరుగుదల సాధ్యమవుతుంది. అలాగే బ్లూ-చిప్ కంపెనీలు స్థిరత్వాన్ని అందిస్తాయని కాబట్టి మెరుగైనా రాబడిని పొందవచ్చు.
బంగారంపై పెట్టుబడులు
ద్రవ్యోల్బణం నుంచి రక్షణకు బంగారాన్ని ఎల్లప్పుడూ అత్యంత నమ్మదగిన మార్గంగా పరిగణిస్తారు. మీరు భౌతిక బంగారం, గోల్డ్ ఈటీఎఫ్‌లు లేదా సావరిన్ బంగారు బాండ్లు స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ద్రవ్యోల్బణం నుంచి రక్షించుకోవడానికి బంగారంపై పెట్టుబడి అద్భుతమైన మార్గంగా ఉంటుంది. గోల్డ్ ఈటీఎఫ్‌లు, బాండ్లలో నిల్వకు ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








