Investment Pledges: భారతదేశంలో పెట్టుబడుల వరద.. ఏకంగా 100 లక్షల కోట్లకు హామీ

ఇటీవల కాలంలో భారతదేశంలో పెట్టుబడిదారుల సదస్సుల జోరు సాగుతుంది. మధ్యప్రదేశ్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సును ముగిసింది. ఈ సదస్సు ద్వారా ప్రపంచ, దేశీయ కంపెనీలు రూ.26.61 లక్షల కోట్ల విలువైన పెట్టుబడికి ముందుకు వచ్చాయని ఆ రాష్ట్రం ప్రకటించింది. ఈ స్థాయి పెట్టుబడి అంటే రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కంటే రెట్టింపుగా ఉంటుంది. అలాగే జనవరి చివరిలో ఒడిశా ఉత్కర్ష్ పేరుతో సమావేశం నిర్వహించి రూ.12.89 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించినట్లు పేర్కొంది.

Investment Pledges: భారతదేశంలో పెట్టుబడుల వరద.. ఏకంగా 100 లక్షల కోట్లకు హామీ
Investments

Updated on: Feb 27, 2025 | 3:15 PM

2025 మొదటి రెండు నెలల్లోనే కర్ణాటక, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం వంటి ఆరు రాష్ట్రాలు పెట్టుబడిదారుల సదస్సులను నిర్వహించాయి. ఆయా సదస్సులు ద్వారా రూ. 60.5 లక్షల కోట్ల విలువైన మొత్తం పెట్టుబడులను సాధించినట్లు పేర్కొన్నాయి. డిసెంబర్ 2024లో రాజస్థాన్, బీహార్‌లలో కూడా పెట్టుబడిదారుల సదస్సులు నిర్వహించారు. మొత్తం మీద కేవలం మూడు నెలల్లో ఎనిమిది రాష్ట్రాలు కలిపి ఏకంగా రూ. 97 లక్షల కోట్లకు పెట్టుబడులను సాధించాయి.  ఆర్థిక సరళీకరణ తర్వాత ఇలాంటి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అయితే గత రెండు దశాబ్దాల్లో  ఈ కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. సోలార్ మాడ్యూల్స్, విండ్ టర్బైన్‌లు, హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్‌లు, లిథియం అయాన్ నిల్వలు, సెమీకండక్టర్ వేఫర్‌లు వంటి తయారీ రంగాల్లో పెట్టుబడులు పెద్ద మొత్తంలో వస్తున్నాయి. ముఖ్యంగా స్టార్టప్ కంపెనీలకు ఆయా రాష్ట్రాలు పెద్ద ఎత్తున మినహాయింపులను ప్రకటించడంతో పెట్టుబడులు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కంపెనీలు వేగంగా ప్రారంభం కావడానికి  అందించే వివిధ రకాల ప్రోత్సాహకాలతో పాటు అన్ని రకాల ఆమోదాలు సులభంగా రావడంతో ఆయా రాష్ట్రాల్లో పెట్టుబడులకు పెద్ద కంపెనీలు కూడా ముందుకు రావడం విశేషం. 

ఇటీవల కాలంలో సాంప్రదాయ తయారీ రాష్ట్రాలకు, ఎక్కువగా వినియోగం ఆధారిత/సేవల ఆధిపత్య ఆర్థిక వ్యవస్థలు కలిగిన రాష్ట్రాలు గట్టి పోటీని ఇస్తున్నాయి. గత ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్ ఇలాంటి సమావేశం తర్వాత రూ. 33.5 ట్రిలియన్ల లేదా దాని ఆర్థిక వ్యవస్థ కంటే 1.6 రెట్లు పెద్ద పెట్టుబడి వాగ్దానాలను ప్రకటించింది. అయితే ప్రకటనలు భారీగా ఉన్నా వాస్తవ రూపంలోకి వచ్చేసరికి పెట్టుబడులు మందగిస్తున్నాయని మరో వాదన. అయితే 2047 నాటికి 30-35 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనే దేశం లక్ష్యం పెట్టుబడులు పెద్ద స్థాయిలో ఉంటున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.  భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చడానికి ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడానికి వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడానికి కేంద్రం రాష్ట్రాలను చురుగ్గా ప్రోత్సహిస్తోంది

అలాగే కొత్త రంగాలతో పాటు, పెట్రోకెమికల్స్, ఆటోమోటివ్, స్టీల్, మైనింగ్, సిమెంట్ తయారీ వంటి సంప్రదాయ రంగాల ద్వారా కూడా పెట్టుబడులు స్థిరంగా ఉన్నాయని నిపుణుల వాదన ఇటీవల ముగిసిన మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ప్రారంభ ఒప్పందాల ద్వారా రూ.26.61 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆయా కంపెనీలు ప్రకటించాయి. ఈ ఒప్పందాల ద్వారా 1.73 మిలియన్ల ఉద్యోగాలు లభిస్తాయి. ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ఎన్‌టీపీసీ కేంద్ర, రాష్ట్ర పునరుత్పాదక ప్రాజెక్టులలో రూ.2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడానికి హామీ ఇవ్వగా అదానీ గ్రూప్ అనేక రంగాల్లో రూ.1.1 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. ఒడిశా కూడా తమ ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపు రూ.5 లక్షల కోట్ల పెట్టుబడి హామీలను పొందగా, ప్రస్తుతం రూ.12.89 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను సాధించింది.

ఇవి కూడా చదవండి

సాంప్రదాయ ఖనిజ ఆధారిత పరిశ్రమలతో పాటు, పునరుత్పాదక ఇంధనం, ఐటీ/ఐటీఈఎస్, ఆహార ప్రాసెసింగ్ వంటి ఇతర రంగాల్లో రాష్ట్రాలు ఒప్పందాలపై సంతకం చేశాయి. జనవరిలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశంలో మహారాష్ట్ర రూ. 15.7 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలపై సంతకం చేయగా, తెలంగాణ కూడా రూ. 1.78 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలపై సంతకం చేసింది. 2047 వికసిత్ భారత్ దిశగా వృద్ధిని నిలబెట్టడంతో ఈ పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి