Fixed Deposit Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ ఇస్తోంది..? పూర్తి వివరాలు

|

May 27, 2022 | 3:13 PM

Fixed Deposit Rates: ప్రస్తుతం డబ్బును పెట్టుబడి పెట్టడానికి మాకు అనేక ఆప్షన్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు దేశంలో పెట్టుబడి కోసం ఇటువంటి అనేక ఆప్షన్స్‌ అందుబాటులో..

Fixed Deposit Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ ఇస్తోంది..? పూర్తి వివరాలు
Follow us on

Fixed Deposit Rates: ప్రస్తుతం డబ్బును పెట్టుబడి పెట్టడానికి మాకు అనేక ఆప్షన్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు దేశంలో పెట్టుబడి కోసం ఇటువంటి అనేక ఆప్షన్స్‌ అందుబాటులో ఉన్నాయి.ఇక్కడ తక్కువ సమయంలో అద్భుతమైన రాబడి లభిస్తుంది. అయినప్పటికీ, ఫిక్స్‌డ్ డిపాజిట్ ఇప్పటికీ పెట్టుబడికి సురక్షితమైన, సులభమైన మార్గంగా పరిగణించబడుతుంది. మే 4న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచిన తర్వాత అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కూడా FDలపై చెల్లించే వడ్డీని పెంచాయి. దేశంలో పనిచేస్తున్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఇప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మునుపటి కంటే మెరుగైన వడ్డీని ఇస్తున్నాయి. ఇక ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ అందించే బ్యాంకులు అందిస్తున్నాము.

ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ రేటు ఇస్తోంది

ఇప్పుడు అన్ని బ్యాంకులు ఎఫ్‌డిపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఏ బ్యాంకు ఎక్కువ వడ్డీ ఇస్తుందో తెలుసుకోవడం మనందరికీ చాలా ముఖ్యం. ఇప్పుడు అన్ని బ్యాంకుల వడ్డీ రేట్ల గురించి తెలుసుకోవడం కాస్త కష్టమైన పని. కాబట్టి వివిధ బ్యాంకులు ఒకే చోట అందించే వడ్డీ రేట్ల గురించి తెలియజేస్తాము.

ఇవి కూడా చదవండి


దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBI రూ. 2 కోట్ల కంటే తక్కువ FDలపై 2.90 నుండి 6.30 శాతం వరకు వడ్డీని ఇస్తోంది. మరోవైపు, ప్రైవేట్ రంగానికి చెందిన ఐడిఎఫ్‌సి బ్యాంక్ 2.50 నుండి 6.75 శాతం వరకు వడ్డీని ఇస్తోంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపైరాబడి మీరు డిపాజిట్ చేసిన మొత్తం, దాని కాలవ్యవధిపై ఆధారపడి ఉంటుంది. మీరు చాలా కాలం పాటు భారీ మొత్తాన్ని డిపాజిట్ చేస్తే మీరు భారీ లాభాలను పొందుతారు. దేశంలోని అన్ని బ్యాంకులు సాధారణ పౌరుల కంటే సీనియర్ సిటిజన్లకు FDపై ఎక్కువ వడ్డీని అందిస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి