Instagram vs Whats App: వస్తుండాయ్ ఫీలింగ్స్.. వాట్సాప్‌లో ఫీలింగ్స్‌పై తాజా ఫీచర్

ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియా యాప్స్‌ను యువతరం ఎక్కువగా వినియోగిస్తున్నారు. వాట్సాప్‌తో పాటు ఇన్‌స్టా, ఫేస్‌బుక్, యూ ట్యూబ్ వంటి యాప్స్ ద్వారా వారి ఫీలింగ్స్ షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ తీసుకొచ్చిన తాజా ఫీచర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Instagram vs Whats App: వస్తుండాయ్ ఫీలింగ్స్.. వాట్సాప్‌లో ఫీలింగ్స్‌పై తాజా ఫీచర్
Instagram Vs Whatsapp

Updated on: Feb 18, 2025 | 8:38 PM

వాట్సాప్ తన ఐఓఎస్ యాప్ కోసం కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు వివిధ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా వాట్సాప్‌తో పాటు ఇన్‌స్టా గ్రామ్ మధ్య అంతరాన్ని తగ్గించడం లక్ష్యంగా నయా అప్‌డేట్స్‌ను నిపుణులు అందుబాటులోకి తీసుకొచ్చారు. వినియోగదారులు వారి వాట్సాప్ ఖాతాలలో వారి ఇన్ స్టా ప్రొఫైల్‌లను సక్రమంగా పంచుకోవడానికి కొత్త అప్ డేట్స్ వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ ఐఓఎస్ యాప్‌నకు సంబధించిన తాజా బీటా వెర్షన్‌లో నిపుణులు గుర్తించారు? అయితే ఈ అప్‌డేట్  ప్రస్తుతం వాట్సాప్‌తో పాటు బీటా వెర్షన్‌తో నిపుణులు పరీక్షించలేదు. 

వాట్సాప్  బీటా తన నివేదికలో వినియోగదారులు తమ ఇన్‌స్టా ప్రొఫైల్ లింక్‌లను షేర్ చేసే ఫీచర్‌ను వాట్సా‌ప్‌లో యాడ్ చేసిందేనే విషయం చాలా మందికి తెలియదు. ఈ  సరికొత్త ఫీచర్‌ ద్వారా యూజర్లు వారి కాంటాక్ట్‌లు వారితో సులభంగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఐఓఎస్ బీటా యాప్ వెర్షన్ 25.2.10.72 కోసం వాట్సాప్‌లో ఈ అప్‌డేట్ కనిపించిందని నిపుణులు చెప్పడం విశేషం. ఈ ఫీచర్ ట్రాకర్ షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌లతో పాటు యూజర్ ప్రొఫైల్ ఇంటర్‌ఫేస్‌లోని లింక్స్ విభాగానికి కొత్త ఆప్షన్ జోడించిందని నిపుణులు పేర్కొంటున్నారు. “యాడ్ లింక్స్” అని పిలిచే కొత్త ఆప్షన్‌తో వినియోగదారులు ప్లస్ ఐకాన్‌ను ఎంచుకోవడం ద్వారా వారి ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌నేమ్‌లను జోడించే అవకాశం ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. 

ఈ ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ యూజర్లను వారు యాడ్ చేస్తున్న ప్రొఫైల్‌ను ప్రామాణీకరించమని అడగడం లేదని కూడా నివేదికలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి ఇన్‌స్టాగ్రామ్‌తో ప్రత్యక్ష అనుసంధానం ద్వారా యూజర్‌నేమ్‌లను ధ్రువీకరించడం లేదా వాట్సాప్ యాప్‌లోని వారి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలకు మాన్యువల్‌గా లాగిన్ అవ్వడం ద్వారా ఈ సమస్యలకు చెక్ పెడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ ఫీచర్ ప్రస్తుతం ఇన్ స్టా లింక్‌లకే పరిమితం అయినప్పటికీ ఫేస్ బుక్‌తో పాటు థ్రెడ్స్  వంటి ఇతర మెటా ఖాతాలకు విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి