భారత్‌తో బలపడుతున్న గల్ఫ్ దేశాల బంధం.. మోదీ హయాంలో 8 రెట్లు పెరిగిన విదేశీ పెట్టుబడులు

|

Dec 22, 2024 | 7:58 PM

నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక దేశంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ప్రస్తుతం, వ్యూహాత్మకంగా ముఖ్యమైన రంగాలు మినహా, చాలా రంగాలు ఎఫ్‌డీఐ అనుమతినిచ్చింది మోదీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ దేశాల నుండి భారతదేశానికి వస్తున్న FDIలు గత 10 సంవత్సరాలలో 8శాతం పెరిగాయి.

భారత్‌తో బలపడుతున్న గల్ఫ్ దేశాల బంధం.. మోదీ హయాంలో 8 రెట్లు పెరిగిన విదేశీ పెట్టుబడులు
Fdi From Gcc
Follow us on

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. అప్పటి నుంచి భారత్‌తో గల్ఫ్ దేశాల సంబంధాలు మరింత బలపడ్డాయి. ఈ దేశాల నుంచి భారత్‌కు వస్తున్న పెట్టుబడులే ఇందుకు తాజా ఉదాహరణ. వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం, గత 10 సంవత్సరాలలో పెట్టుబడి 8 రెట్లు పెరిగింది. గల్ఫ్ సహకార మండలి దేశాల నుండి భారతదేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) సెప్టెంబర్ 2013 నుంచి సెప్టెంబర్ 2024 మధ్య 24.54 బిలియన్ డాటర్లకు పెరిగింది. ఏప్రిల్ 2000 నుంచి సెప్టెంబర్ 2013 మధ్య ఈ దేశాల నుండి 3.046 బిలియన్ డాలర్లతో పోలిస్తే, 8 రెట్లు పెరుగుదల నమోదు చేసుకుంది.

గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ GCC దేశాల నుండి భారతదేశానికి వస్తున్న FDIలో 89 శాతం గత 10 సంవత్సరాలలో వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇది భారతదేశం – గల్ఫ్ ప్రాంతం మధ్య బలపడుతున్న ఆర్థిక సంబంధాలను ప్రతిబింబిస్తుంది. ప్రస్తుతం కువైట్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC)కి అధ్యక్షత వహిస్తోంది. కాబట్టి ప్రధాని నరేంద్ర మోదీ ఎమిరేట్స్ పర్యటన బహ్రెయిన్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఎఇ, కువైట్‌లతో భారత్ సత్సంబంధాలు కొనసాగిస్తోంది. శనివారం(డిసెంబర్ 21) మధ్యాహ్నం కువైట్ చేరుకున్న ప్రధాని మోదీ 43 ఏళ్ల తర్వాత గల్ఫ్‌లో పర్యటించిన తొలి భారత ప్రధానిగా రికార్డు సృష్టించారు. కువైట్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ భారత్‌లో 10 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టిందని, దీంతో ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలపడిందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ చెప్పారు.

సావరిన్ వెల్త్ ఫండ్ అయిన కువైట్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ భారతదేశంలో గణనీయమైన పెట్టుబడులు పెట్టిందని, ఇప్పుడు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి పెరుగుతోందని ప్రధాని మోదీ ప్రస్తావించారు. కువైట్ న్యూస్ ఏజెన్సీ (KUNA)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, కువైట్ – భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు వర్తక, వాణిజ్యం ముఖ్యమైన స్తంభాలుగా ఉన్నాయని, రెండు దేశాల మధ్య వాణిజ్యం వృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ అన్నారు. వర్తక, వాణిజ్యం మన ద్వైపాక్షిక సంబంధాలకు ముఖ్యమైన స్తంభాలుగా ఉన్నాయని ప్రధాన మంత్రి CUNA డైరెక్టర్ జనరల్ ఫాత్మా అల్-సలేమ్‌తో అన్నారు. మన ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుతోంది. భారత్ శక్తి భాగస్వామ్యం ద్వైపాక్షిక వాణిజ్యానికి ప్రత్యేక విలువను ఇస్తున్నట్లు తెలిపారు.

కువైట్ భారతదేశానికి ముఖ్యమైన భాగస్వామి, ముడి చమురు సరఫరాలో ఆరవ అతిపెద్ద దేశంగా ఉంది. భారతదేశ ఇంధన అవసరాలలో 3 శాతం తీరుస్తుంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2023-24లో 10.47 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. భారతీయ ఎగుమతులు సంవత్సరానికి 34.7 శాతం పెరుగాయి. ఇదిలా ఉండగా, GCC దేశాలతో భారతదేశ వాణిజ్యం 2022-23లో 184.46 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

కువైట్‌లో ముఖ్యంగా ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, మెకానికల్ మెషినరీ, టెలికమ్యూనికేషన్ రంగాలలో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు కొత్త మార్కెట్ క్రియేట్ చేస్తున్నందుకు సంతోషంగా ఉన్నామని ప్రధాని మోదీ KUNA వార్తా సంస్థతో అన్నారు. నేడు భారతదేశం ప్రపంచ స్థాయి ఉత్పత్తులను అతి తక్కువ ధరతో తయారు చేస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడానికి చమురుయేతర వాణిజ్యాన్ని వైవిధ్యపరచడం కీలకమని మోదీ స్పష్టం చేశారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..