Fake Currency: రూ.10 నుండి రూ.2000 వరకు నకిలీ నోట్లు.. ఇవి బ్యాంకుల్లో ఎవరు డిపాజిట్‌ చేస్తున్నారు?

దేశంలో నకిలీ నోట్లను అరికట్టేందుకు అధికారులు, పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అయితే ఇంకా అక్కడక్కడ కొన్ని నకిలీ నోట్లు వస్తున్నాయి. అయితే గతేడాది బ్యాంకులకు చేరిన నకిలీ నోట్ల గురించి తెలిస్తే షాకవుతుంటారు.నిజానికి బ్యాంకుల్లో రూ.2000 నకిలీ నోట్లే కాకుండా..

Fake Currency: రూ.10 నుండి రూ.2000 వరకు నకిలీ నోట్లు.. ఇవి బ్యాంకుల్లో ఎవరు డిపాజిట్‌ చేస్తున్నారు?
Notes

Updated on: Mar 11, 2024 | 4:40 PM

దేశంలో నకిలీ నోట్లను అరికట్టేందుకు అధికారులు, పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అయితే ఇంకా అక్కడక్కడ కొన్ని నకిలీ నోట్లు వస్తున్నాయి. అయితే గతేడాది బ్యాంకులకు చేరిన నకిలీ నోట్ల గురించి తెలిస్తే షాకవుతుంటారు.నిజానికి బ్యాంకుల్లో రూ.2000 నకిలీ నోట్లే కాకుండా రూ.10 నుంచి రూ.2000 వరకు ఉన్న నోట్లన్నీ బ్యాంకుల్లో చేరుతున్నాయని బ్యాంకు అధికారులు గుర్తిస్తున్నారు. ప్రతిరోజూ అలాంటి నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసి, వాటిని సేకరించారు బ్యాంకు అధికారులు. అనంతరం వాటిని పోలీసులకు అప్పగించారు. దీంతో పాటు వివిధ బ్యాంకుల నుంచి కూడా పలు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై ఢిల్లీలోని సంసద్ మార్గ్ పోలీస్ స్టేషన్లో గత కొన్ని రోజులుగా మొత్తం 15 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు అక్కడి పోలీసులే తెలిపారు. ఈ ఎఫ్‌ఐఆర్‌లలో ఒకటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిపై కేసు నమోదైంది.

కొంత కాలం క్రితం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో నకిలీ వెబ్ సిరీస్ విడుదలైందని ఆ వర్గాలు తెలిపాయి. దీనిపై చాలా ప్రశంసలు వచ్చాయి. ఒక వ్యక్తి నకిలీ నోట్‌ను ఎలా సృష్టిస్తాడోనన్న విషయాన్ని ఈ సిరీస్ చూపించింది. అయితే మార్కెట్‌లో ఖచ్చితంగా అలాంటి నకిలీ నోట్లు ఉన్నాయి. అవి నకిలీవని సాధారణ ప్రజలు కూడా గుర్తించలేరు. ఆ నోట్లు బ్యాంకులకు చేరినప్పుడు మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే సామన్య జనాలకు అవి నకిలీ నోట్లు అని తెలియవు. బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన తర్వాత అవి వెలుగులోకి వస్తున్నాయి.

బ్యాంకుల్లోకి ఈ నకిలీ నోట్లు ఇలా వచ్చాయి:

ఇవి కూడా చదవండి

నకిలీ నోట్ల రాకపై బ్యాంకుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం అందుతూనే ఉంటుందని పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నకిలీ నోట్లు దొరికిన బ్యాంకుల నుంచి సమాచారం అందింది. ఈ నోట్లు జూలై 1, 2023 నుండి డిసెంబర్ 31, 2023 వరకు బ్యాంకుల వద్ద కొన్ని నకిలీ నోట్లు వచ్చినట్లు గుర్తించారు. అయితే ఈ నోట్లు ఉన్నవారు నేరస్థులు కాదు.. సామాన్యులు. అసలు సాధారణ ప్రజలు నకిలీ నోట్లను గుర్తించలేకపోయినా.. బ్యాంకులో డిపాజిట్‌ అయిన తర్వాత గుర్తిస్తున్నారు. అందువల్ల పోలీసులు కూడా ఎవరిపైన కూడా చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, ప్రతిరోజూ కనీసం ఒకరిద్దరు వ్యక్తులు నకిలీ నోట్లను కలిగి ఉన్నారని బ్యాంకు పోస్ట్ చేయబడిన ఒక నివేదిక ద్వారా తెలుస్తోంది. అయితే ఈ నోకిలీ నోట్లు అని సామాన్య ప్రజలకు తెలియదు. వారు డిపాజిట్‌ చేసేందుకు బ్యాంకుకు వచ్చినప్పుడు కొన్నిసార్లు నకిలీ నోట్లను గుర్తించిన అధికారులు..అవి వెనక్కి ఇచ్చేయడంతో గొడవలు కూడా జరుగుతున్నాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఇలా పెద్ద ఎత్తున నకిలీ నోట్లు బ్యాంకులకు రాకపోయినా.. అప్పుడప్పుడు డబ్బుల కట్టల్లో ఒకటి రెండు నోట్లు బయటపడుతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి