Chitra Ramakrishna: చిత్రరామకృష్ణ లీలలు.. దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న షాకింగ్ విషయాలు..

|

Mar 08, 2022 | 1:45 PM

Chitra Ramakrishna: కొ-లొకేషన్ స్కామ్ కేసులో సీబీఐ అధికారులు ఎన్‌ఎస్‌ఈ మాజీ చీఫ్ చిత్రా రామకృష్ణను దిల్లీలో అరెస్టు చేశారు. ఇది కొంతమంది స్టాక్ బ్రోకర్లు లాభపడేందుకు అన్యాయంగా జరిగిన కుంభకోణం.

Chitra Ramakrishna: చిత్రరామకృష్ణ లీలలు.. దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న షాకింగ్ విషయాలు..
Chitra Ramakrishna
Follow us on

Chitra Ramakrishna: కొ-లొకేషన్ స్కామ్(Co-location Scam) కేసులో సీబీఐ అధికారులు ఎన్‌ఎస్‌ఈ మాజీ చీఫ్ చిత్రా రామకృష్ణను దిల్లీలో అరెస్టు చేశారు. ఇది కొంతమంది స్టాక్ బ్రోకర్లు లాభపడేందుకు అన్యాయంగా జరిగిన కుంభకోణం. దీని ద్వారా కొంతమంది స్టాక్ బ్రోకర్లకు(Stock Brokers) అనుకూలంగా వ్యవహించటం వల్ల ఇతరులు నష్టపోయారు. ఈ కొ-లొకేషన్ స్కామ్ కేసులో చిత్రరామకృష్ణ కీలక అంతర్గత సమాచారాన్ని బయటి వ్యక్తులకు పంచుకుందనడాన్ని నిరూపించేందుకు అవసరమైన డాక్యుమెంటరీ సాక్ష్యాలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ గుర్తించింది. చిత్రరామకృష్ణ ప్రస్తుతం సీబీఐ ప్రధాన కార్యాలయంలో లాకప్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ విషయానికి సంబంధించి చిత్రను సీబీఐ అధికారులు మూడు రోజుల పాటు ప్రశ్నించారు. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ఆమె ఇంట్లో సోదాలను సైతం నిర్వహించారు. ఆమె నుంచి నిజం రాబట్టేందుకు సెంట్రల్ ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి చెందిన సీనియర్ సైకాలజిస్టుల సహాయాన్ని వినియోగించింది. ఆదాయపన్నుశాఖ సైతం గత నెలలో చిత్ర, ఆనంద్ సుబ్రమణియన్ ముంబయి, చెన్నై నివాసాల్లో సోదాలు నిర్వహించింది. హిమాలయ యోగి ముసుగులో చిత్ర ద్వారా మార్కెట్లను తారుమారు చేసినట్లు సుబ్రమణియన్‌పై ఆరోపణలు ఉన్నాయి.

ఎన్ఎస్ఈ మాజీ చీఫ్ అక్రమ సంపాదనకు స్టాక్ మార్కెట్లను వినియోగించుకున్నారా. సెబీ కనుసన్నల్లో ఉండే ఎక్ఛేంజ్ లో అక్రమాలకు పాల్పడ్డారా. తన పదవిని అడ్డుపెట్టుకుని ఆర్థిక నేరానికి పాల్పడ్డారా. ఇలాంటి అనేక విషయాలపై వివిధ సంస్థలు దర్యాప్తు చేసిన తరువాత ఆదివారం సీబీఐ ఆమెను అరెస్ట్ చేసింది. చిత్ర ఫోబ్స్ శక్తివంతమైన మహిళల జాబితాలో గుర్తింపు పొందారు.

అన్ని ఆధారాలు మాయమయ్యాయి..

న్యాయం చేసే ప్రయత్నంలో సెబీ ఫిబ్రవరిలో రామకృష్ణపై రూ. 3 కోట్లు, సుబ్రమణియన్, NSE మాజీ MD, CEO రవి నారాయణ్‌పై రూ. 2 కోట్లు చొప్పున ఫైన్ విధించగా.. వీఆర్ నరసింహపై రూ.6 లక్షలు ఫైన్ విధించింది. ఏడాదికి రూ. 15 నుంచి రూ. 20 కోట్లు జీతంగా తీసుకునే వారికి రూ. 2-3 కోట్లు జరిమానా విధించటం పెద్ద విషయం కాదు. ఇదే సమయంలో కీలక ఆధారాలు దొరకకుండా చిత్ర, సుబ్రమణియన్ వినియోగించిన ల్యాప్ టాప్ లను స్కాప్ కు తరలించటం.. కీలక సాంకేతిక ఆధారాలను తొలగించినట్లు దర్యాప్తులో తేలింది.

అజ్ఞాత హిమాలయన్ యోగి వ్యవహారం..

ఈ వ్యవహారంలో చిత్రి, అజ్ఞాత యోగికి మధ్య జరిగిన ఈమెయిల్ సంభాషణ ద్వారా కొంత మంది ఎక్కువగా లాభపడ్డట్లు దర్యాప్తులో తేలింది. కొన్ని వ్యక్తిగత విషయాల మెయిళ్లు బయటపడ్డాయి. చిత్రి కురులపై యోగి చేసిన కామెంట్లు, యోగి చెప్పేవాటిని గత 20 ఏళ్లుగా చిత్ర పాటించటం, ఇప్పటి వరకూ ఆయనను కలవకపోవటంతో పాటు మరిన్ని లూప్ హోల్స్ ఈ కేసులో ఉన్నాయి. ఈ-మెయిళ్ల వల్ల ఎక్కువగా లాభపడిన వ్యక్తి ఆనంద్ సుబ్రమణియన్. ఈ వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు ఆనంద్ ఆ అజ్ఞాత యోగి అనడానికి కొన్ని సాక్ష్యాలను అందించింది. ప్రభుత్వం ఉద్యోగుల పీఎఫ్ సొమ్మును స్టాక్ మార్కెట్ లో పెట్టుబడిగా పెట్టే నిర్ణయం వెనుక చిత్ర ప్రయత్నం చాలా ఉందని తెలుస్తోంది. ఈ నిర్ణయం ఆ అజ్ఞాత యోగి సూచన మేరకు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

2015 వరకు అంతా సవ్యంగానే ఉంది. కానీ సింగపూర్ కు చెందిన ఒక అజ్ఞాత వ్యక్తి ఎన్ఎస్ఈ కొంత మంది స్టాక్ బ్రోకర్లకు సర్వర్ల ప్రిఫరెన్సియల్ యాక్సెస్ ఇస్తున్నట్లు ఫిర్యాదు రావటంతో ఈ స్కామ్ బయటకు వచ్చింది. దీంతో ఎన్ఎస్ఈలో చిత్ర హవా మసకబారటం మెుదలైంది. 2016లో దీనిపై దర్యాప్తుకు సెబీ ఒక కమిటీని నియమించింది. అదే సంవత్సరం చిత్ర, సుబ్రమణియన్ తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో యోగితో మెయిళ్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో కుంభకోణంలోని మరిన్ని అంశాలు బయటకు వచ్చాయి.

ఇవీ చదవండి..

Market News: స్పల్ప ఊగిసలాటల్లో మార్కెట్లు.. బలాన్ని నింపిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..

AP Capital: ఏపీ రాజధాని హైదరాబాదే.. తెరపైకి కొత్త పేరు.. మంత్రి బొత్స షాకింగ్ కామెంట్స్