Agriculture: మీ పశువులకు ఏ సీజన్‌లో ఏ మేత వేస్తున్నారు.? నిపుణులు ఏమంటున్నరంటే..

మనుషులకు ఆహార విషయంలో నిబంధనలు ఉన్నట్లు పశువులకు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే పశువులకు మేత వేసే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు. సీజన్ కు అనుగుణంగా పశువుల మేతను మార్చాలని సూచిస్తున్నారు. ఇంతకీ నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

Agriculture: మీ పశువులకు ఏ సీజన్‌లో ఏ మేత వేస్తున్నారు.? నిపుణులు ఏమంటున్నరంటే..
Animals Feeding
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 04, 2024 | 4:43 PM

మారుతోన్న వాతావరణం ఆధారంగా మనం తీసుకునే ఆహారాన్ని మార్చుతుంటాం. అయితే కేవలం ఇది కేవలం మనుషులకు మాత్రమే పరిమితం కాదని పశువులకు కూడా వరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పవువుల పెంపకందారులు మేత విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు. సీజన్‌కు అనుగుణంగా మేతను మార్చాలని సూచిస్తున్నారు. ఇంతకీ ఏ సమయంలో ఎలాంటి మేత వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

నిపుణుల అభిప్రాయం ప్రకారం మనుషులకు ఆహారం ఎంత ముఖ్యమో జంతువులకు కూడా అంతే ముఖ్యమని చెబుతున్నారు. సరైన ఆహారం అందించకపోతే వాటి ఆరోగ్యం క్షీణిస్తుంది. అందుకే కాలానుగుణంగానే కాకుండా నెలవారీగా కూడా పశువులకు మేత తినిపించడానికి ప్రయత్నించాలని అంటున్నారు. పశువైద్యుల సూచనల ప్రకారం, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో జంతువులకు కంది, మెంతులు, బెరడు, సైలేజ్, పొట్టు వంటివి అందించాలని సూచిస్తున్నారు. ఇది పశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు పాలు ఇచ్చే సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.

ఇక మే, జూన్ నెలల్లో జంతువులకు సైలేజ్, లూసర్న్, కౌపీయా గడ్డిని తినిపించాలని చెబుతున్నారు. అలాగే జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో పచ్చి జొన్నలు, పచ్చి జొండాలు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అక్టోబరు, నవంబర్, డిసెంబర్ నెలల్లో పశువుల పెంపకందారులు తమ జంతువులకు గడ్డి, నేపియర్ గడ్డి, జొన్నలను ఇవ్వడం మంచిదని అంటున్నారు. తినిపిస్తే మంచిది. జంతువులకు ఎప్పుడూ నీటిలో నానబెట్టిన గడ్డిని ఇవ్వాలని అంటున్నారు. ఇది జంతువుల జీర్ణక్రియ ప్రక్రియను సజావుగా ఉండేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు.

జంతు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతిరోజూ ఒకే సమయంలో జంతువులకు మేత ఇవ్వాలని సూచిస్తున్నారు. రోజుకు రెండుసార్లు జంతువులకు మేత వేయాలి. జంతువులకు 8 నుంచి 10 గంటల వ్యవధిలో ఆహారం ఇవ్వాలి. ఇలా చేస్తే వాటి జీర్ణక్రియ ప్రక్రియను సరిగ్గా ఉంటుంది. ఆహారం జీర్ణం కావడానికి వారికి తగినంత సమయం కూడా లభిస్తుంది. అంతే కాకుండా పశువులకు ఎప్పుడూ దాణాతో పాటు ధాన్యాలు ఇవ్వాలి. లేదంటే పాల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే