Income Tax: ఇంట్లో డబ్బులు దాచుకునేవారికి షాకింగ్ న్యూస్.. భారీగా ఫైన్..! ఐటీ శాఖ కొత్త రూల్స్..

Income Tax New Rules: మీరు ఇంట్లో డబ్బులు దాచుకుంటున్నారా..? ఎంత దాచుకున్నా ఏం కాదులే అని భావిస్తున్నారా..? ఐటీ శాఖ తీసుకొస్తున్న రూల్స్ మీపై ప్రభావం చూపవచ్చు. మీరు దాచుకున్న డబ్బులకు ఆధారాలు చూపించకపోతే భారీగా జరిమానా కట్టాల్సి వచ్చే అవకాశముంది. ఎలా అంటే..

Income Tax: ఇంట్లో డబ్బులు దాచుకునేవారికి షాకింగ్ న్యూస్.. భారీగా ఫైన్..! ఐటీ శాఖ కొత్త రూల్స్..
Money

Updated on: Dec 12, 2025 | 3:25 PM

బ్లాక్ మనీ, అక్రమ నగదును అరికట్టేందుకు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకురానుంది. నగదు లావాదేవీలపై మరింత నిఘా పెంచనుంది. అక్రమ నగదు పట్టుబడితే భారీగా జరిమానాలు వేసేందుకు సిద్దమవుతోంది. నగదు బదిలీ, విత్ డ్రాలపై కొన్ని పరిమితులు విధించనుంది. ఈ పరిమితులకు మించి మీరు నగదు లావాదేవీలు జరిపితే ఆటోమేటిక్‌గా ఆదాయపు పన్ను శాఖ కనుసన్నల్లోకి వెళతారు. ఆదాయానికి మించి మీరు లావాదేవీలు జరిపినట్లు నిరూపితమైతే భారీ మొత్తంలో జరిమానా కట్టాల్సి వస్తుంది. త్వరలోనే కొత్త రూల్స్‌ను తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఆదాయపు పన్ను శాఖ నిమగ్నమైంది.

ఇంట్లో డబ్బులు దాచుకుంటున్నారా..?

ఇంట్లో మీరు పెద్ద మొత్తంలో డబ్బులు దాచుకుంటున్నారా..? మీకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే ఆధారాలు మీ దగ్గర ఉంచుకోవాలి. ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినప్పుడు సరైన ఆధారాలు చూపించకపోతే 84 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. చాలామంది ఇంట్లో లక్షలకు లక్షలు డబ్బులు దాచుకుంటూ ఉంటారు. అవి ఎలా వచ్చాయనే ఆధారాలు దాచిపెట్టుకోవాలి. ఇక ప్రాపర్టీ అమ్మినప్పుడు రూ.20 వేల కంటే ఎక్కువ నగదు పొందితే 100 శాతం జరిమానా పడుతుంది. ఇక ఏదైనా వ్యక్తి నుంచి రోజుకు రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదు తీసుకున్నా 100 శాతం ఫైన్ పడే అవకాశం ఉంటుంది.

రూ.10 లక్షల కంటే ఎక్కువ తీసుకుంటే..?

మీరు ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ నగదు విత్ డ్రా చేస్తే బ్యాంకుల ద్వారా మీ డీటైల్స్ ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు చేరుతాయి. దీంతో ఐటీ శాఖ మీ అకౌంట్‌పై నిఘా ఉంచుతుంది. ఇక ఒకే ఏడాదిలో రూ.10 లక్షల కంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే టీడీఎస్ పే చేయాలి. ఇక తరచుగా బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో లావాదేవీలు చేస్తున్నా బ్యాంకులు మీ వివరాలు ఐటీ శాఖకు అందజేస్తాయి.

కొత్త రూల్స్ ఎందుకు..?

ముఖ్యంగా బ్లాక్ మనీని అడ్డుకోవడం ఐటీ శాఖ ప్రధాన ఉద్దేశం. కొంతమంది నగదు రూపంలో బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకుంటున్నారు. దీనిని అరికట్టడానికి ఈ నిర్ణయాలు ఉపయోగపడతాయని ఐటీ శాఖ చెబుతోంది. ఇక ఈ కఠిన నిర్ణయాల వల్ల నగదు లావాదేవీల్లో పారదర్శకత వస్తుందని చెబుతోంది.