OLA Solo: డ్రైవర్ లేకుండానే రోడ్లపై ఈవీ స్కూటర్ పరుగులు.. ఓలా మతిపోయే ఆవిష్కరణ

తాజాగా ప్రముఖ ఈవీ స్కూటర్ తయారీదారు అయిన ఓలా చేసిన ఆవిష్కరణ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భవిష్ అగర్వాల్ కంపెనీకు సంబంధించిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వెల్లడించారు. ఓలా సోలో పేరుతో  ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డ్రైవర్ లెస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా ప్రచారం పొందింది. 'ఓలా సోలో భారతదేశపు మొట్టమొదటి స్వయంప్రతిపత్త ఎలక్ట్రిక్ స్కూటర్'  అని భవిష్ అగర్వాల్ ట్వీట్ చేశారు.

OLA Solo: డ్రైవర్ లేకుండానే రోడ్లపై ఈవీ స్కూటర్ పరుగులు.. ఓలా మతిపోయే ఆవిష్కరణ
Ola Solo
Follow us

|

Updated on: Apr 04, 2024 | 4:10 PM

ప్రపంచవ్యాప్తంగా ఇటీవల ఈవీ వాహనాల అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో అయితే ఈవీ స్కూటర్ల కొనుగోలు గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఈవీ స్కూటర్లపై ప్రత్యేక ఆవిష్కరణలు ఔరా అనిపిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈవీ స్కూటర్ తయారీదారు అయిన ఓలా చేసిన ఆవిష్కరణ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భవిష్ అగర్వాల్ కంపెనీకు సంబంధించిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వెల్లడించారు. ఓలా సోలో పేరుతో  ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డ్రైవర్ లెస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా ప్రచారం పొందింది. ‘ఓలా సోలో భారతదేశపు మొట్టమొదటి స్వయంప్రతిపత్త ఎలక్ట్రిక్ స్కూటర్’  అని భవిష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. ఏఐ ఎనేబుల్, ట్రాఫిక్-స్మార్ట్ స్కూటర్ అయిన ఓలా సోలో గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

అయితే ఇది ఏప్రిల్ ఫూల్స్ జోక్ మాత్రం కాదని ఓలా నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సాంకేతికత మేము పని చేస్తున్నామని, ఓలా ఇంజినీరింగ్ బృందాలు ఎలాంటి మార్గదర్శక పనిని చేయగలదో చూపిస్తుందని భవిష్ అగర్వాల్ చెబుతున్నారు. ఓలా సోలో అనేది భవిష్యత్‌లో ఈవీ స్కూటర్‌ల సరికొత్త వెర్షన్ అని భావించవచ్చని నిపుణులు చెబతున్నారు. ఓలా సోలో డ్రైవర్ లెస్ రైడింగ్ అత్యంత అధునాతన సాంకేతికత, క్వాంటం కంప్యూటింగ్‌ను న్యూరల్ నెట్‌వర్క్‌లతో కలపడం ద్వారా సాధ్యం అవుతుందని ఓలా ప్రతినిధులు చెబుతున్నారు. ఓలా సోలో క్వికీ ఏఐ సాంకేతికతతో స్ప్లిట సెకండ్ నిర్ణయాలు తీసుకోగలదు. ఓలా సోలో అంతర్గతంగా అభివృద్ధి చెందిన చిప్ ఎల్ఎంఏఓ9000 ఆధారంగా పని చేస్తుంది. ఈ స్కూటర్ వీధుల్లో సులభంగా నావిగేట్ చేయడానికి నిజ-సమయ ట్రాఫిక్ డేటాను విశ్లేషిస్తుంది. ఓలా సోలో ఎలక్ట్రోస్‌నూజ్ క్వాంటం ద్వారా ప్రారంభించబడిన వినూత్న ‘జ్యూస్ అప్’ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. ఓలా సోలో తక్కువ ఛార్జ్‌లో నడిచిన ప్రతిసారీ, అది శక్తిని పొందేందుకు సమీపంలోని హైపర్‌చార్జర్‌ కనుగొని అక్కడకు వెళ్లిపోతుంది. 

ఇవి కూడా చదవండి

ఓలా సోలోకు సంబంధించిన అడాప్టివ్ అల్గారిథమ్ ప్రతి రైడ్ నుంచి నేర్చుకోవడంలో సహాయపడుతుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ 22 భాషలకు మద్దతుతో క్రుట్రిమ్ వాయిస్ ఎనేబుల్ ఏఐ సాంకేతికతతో వస్తుంది. ఈ స్కూటర్ అదనపు భద్రత కోసం ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్, హెల్మెట్ యాక్టివేషన్‌ను కలిగి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇది సమన్ ఫీచర్‌ని కలిగి ఉంది. ఓలా యాప్ ద్వారా ఈ ఫీచర్ యాక్టివేట్ అయినప్పుడు డ్రైవర్‌లెస్ రైడ్ మిమ్మల్ని ఎంచుకుంటుంది. ముఖ్యంగా వైబ్రేటింగ్ సీటు రాబోయే మలుపులు లేదా సంభావ్య ప్రమాదాల గురించి మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఓలా సోలో కోసం లాంచ్ తేదీ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సొంతింటి కల..నెరవేర్చుకోండిలా..!
సొంతింటి కల..నెరవేర్చుకోండిలా..!
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.