EPFO: పీఎఫ్ వాట్సప్ సేవలు వచ్చేశాయి.. బ్యాలెన్స్, పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. నెంబర్ ఇదే..

ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వాట్సప్ సేవలను కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు వాట్సప్ నెంబర్ ప్రకటించింది. ఈ నెంబర్‌కు వాట్సప్‌లో హాయ్ అని మెస్సేజ్ పెట్టడం ద్వారా అన్నీ వివరాలు తెలుసుకోవచ్చు. ఆదివారం నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

EPFO: పీఎఫ్ వాట్సప్ సేవలు వచ్చేశాయి.. బ్యాలెన్స్, పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. నెంబర్ ఇదే..
Epfo Whatsapp

Updated on: Nov 02, 2026 | 7:12 AM

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. చందాదారుల కోసం వాట్సప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఢిల్లీలోఆ ఆదివారం జరిగిన 74వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా.. ఈ కొత్త సేవలను కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీ ప్రారంభించారు. పీఎఫ్ రికార్డుల్లో నమోదైన మొబైల్ నెంబర్ ద్వారా వాట్సప్‌లో హాయ్ అని మెస్సేజ్ పెట్టడం ద్వారా పీఎఫ్ సేవలను ఉద్యోగులు పొందవచ్చు. ఇక నుంచి పీఎఫ్ పోర్టల్, ఉమాంగ్ యాప్‌కు వెళ్లకుండానే వాట్సప్‌లో కొన్ని సేవలు పొందే అవకాశం లభించింది. అలాగే ఉద్యోగులు తమ సందేహాలను కూడా నివృత్తి చేసుకోవచ్చు. దీంతో పీఎఫ్ వెబ్ సైట్, ఉమాంగ్ యాప్‌ను సందర్శించాల్సిన అవసరం ఉండదు. దీని పీఎఫ్ సేవలను పొందటం ఖాతాదారులకు మరింత సులువవుతుంది.

వాట్సప్‌లో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలా..?

-మీ ఫోన్‌లో 87964 41800 నెంబర్‌ను సేవ్ చేసుకోవాలి

-అనంతరం ఈపీఎఫ్ఓ రికార్డుల్లో రిజిస్టర్ అయిన నెంబర్ నుంచి వాట్సప్‌లో హాయ్ అని పంపాలి

-ఆ తర్వాత భాష ఎంచుకోవాలి

-అక్కడ ఆప్షన్లలో పీఎఫ్ బ్యాలెన్స్, లాస్ట్ 5 ట్రాన్సాక్షన్లు, పాస్ బుక్ డౌన్ లోడ్ వంటివి కనిపిస్తాయి

-పీఎఫ్ బ్యాలెన్స్ ఆప్షన్ సెలక్ట్ చేసుకుని సబ్మిట్ చేయాలి

-టెక్ట్స్ మెస్సేజ్ రూపంలో మొబైల్‌కు వచ్చే ఓటీపీని వాట్సప్‌లో నమోదు చేయాలి

-ఆ తర్వాత మీ పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలన్నీ అందుతాయి. ఉద్యోగి, యజమాని వాటాలతో పాటు పెన్షన్ అమౌంట్, చివరి లావాదేవీ ఎప్పుడు జరిగిందనే సమాచారం వస్తుంది

-మళ్లీ మెనూలోకి వెళ్లి పీఎఫ్ పాస్ బుక్ ఆప్షన్ సెలక్ట్ చేసుకుని ఓటీపీ నమోదు చేయాలి

-పీఎఫ్ పాస్ బుక్ పీడీఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు

-మీ డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేస్తే ఫైల్ ఓపెన్ అవుతుంది

ఈ సేవలు కూడా పొందవచ్చు

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఉద్యోగంలో చేరి పీఎఫ్ ఖాతా ఉన్నవారికి తొలి ఏడాది రూ.15 వేల సాయం అందిస్తోంది. పీఎంవీబీఆర్‌వై పథకం కింద ఈ సొమ్ము ఇస్తుండగా.. దీనికి సంబంధించిన వివరాలను, సందేహాలను కూడా వాట్సప్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఈ వాట్సప్ సేవలు పొందాలంటే ఖచ్చితంగా ఈపీఎఫ్ఓ రికార్డుల్లో నమోదైన మొబైల్ నెంబర్ నుంచి మాత్రమే మెస్సేజ్ చేయాలి. అలాగే పీఎఫ్ పోర్టల్‌లో ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ లాంటి కేవైసీ వివరాలు అప్డేట్ చేసి ఉండాలి. ఇప్పటివరకు పీఎఫ్ బ్యాలెన్స్ ,పాస్ బుక్ చూసుకునేందుక పీఎఫ్ పోర్టల్, ఉమాంగ్ యాప్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు సులభంగా మీ వాట్సప్ నుంచే చెక్ చేసుకోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us