EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు కేంద్రం భారీ గుడ్‌న్యూస్‌.. వడ్డీ జమ తేదీ ఫిక్స్‌.. రూ.5 లక్షల వరకు ఆటో క్లెయిమ్‌

EPFO: ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌ తెలిపింది ఈపీఎఫ్ ఓ. ఈ సంస్థ వచ్చే వారంలోగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 34 కోట్లకు పైగా ఖాతాలకు రూ.1.44 లక్షల కోట్లకు పైగా వడ్డీని జమ చేయడం ప్రారంభించనుంది. ఇప్పుడు పీఎఫ్‌ క్లెయిమ్‌లు మరింత సులభతరం కానుంది. దేశ వ్యాప్తంగా ..

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు కేంద్రం భారీ గుడ్‌న్యూస్‌.. వడ్డీ జమ తేదీ ఫిక్స్‌.. రూ.5 లక్షల వరకు ఆటో క్లెయిమ్‌
Epf

Updated on: Jul 08, 2026 | 1:48 PM

దేశంలోని 8 కోట్ల పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త అందించింది కేంద్ర ప్రభుత్వం. పీఎఫ్‌ వడ్డీ డబ్బులను జమ చేసేందుకు తేదీ ఖరారు చేసింది. ఈ వడ్డీ ఈపీఎఫ్ఓ సభ్యుల ఖాతాలో జమ కానుంది. ఈపీఎఫ్ఓ సభ్యుల ఖాతాలో 8.25 శాతం జమ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జూలై 15వ తేదీ నాటికి పీఎఫ్‌ డబ్బులను జమ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అలాగే ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌ తెలిపింది. 5 లక్షల రూపాయల వరకు పీఎఫ్‌ ఆటో క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ చేసుకోవచ్చని ప్రకటించింది.

ఈపీఎఫ్‌లో కొత్త డిజిటల్‌ వ్యవస్థను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. కేంద్రం తీసుకున్న చర్యలతో ఇప్పుడు ఉద్యోగులకు పీఎఫ్‌ సేవలు మరింత సులభం కానున్నాయి. దేశ వ్యాప్తంగా ఒకే డేటాబేస్‌లో పీఎఫ్‌ వివరాలు ఉండనున్నాయి. సిస్టమ్ అప్‌గ్రేడ్ కారణంగా బదిలీ ప్రక్రియ కూడా వేగవంతం అయ్యే అవకాశం ఉంది.

ఈ సంస్థ వచ్చే వారంలోగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 34 కోట్లకు పైగా ఖాతాలకు రూ.1.44 లక్షల కోట్లకు పైగా వడ్డీని జమ చేయడం ప్రారంభించనుంది. ఇప్పుడు పీఎఫ్‌ క్లెయిమ్‌లు మరింత సులభతరం కానుంది. దేశ వ్యాప్తంగా ఏ ఈపీఎఫ్‌వో ఆఫీస్‌ నుంచైనా సేవలు పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు సేవలు మరింత సులభం:

అప్‌గ్రేడ్ చేసిన సిస్టమ్ సభ్యులకు మరింత సులభమైన, వేగవంతమైన అనుభవాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. నిర్ణీత ‘బ్లాక్‌అవుట్ పీరియడ్’ పూర్తయిన తర్వాత ఈ వారం నుండి కొత్త ప్లాట్‌ఫారమ్ పూర్తిస్థాయి అమలు ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు ఈపీఎఫ్‌వో ​​వికేంద్రీకృత వ్యవస్థ ద్వారా పనిచేసింది. దీనిలో ప్రాంతీయ కార్యాలయాలు స్వతంత్రంగా పనిచేసేవి. సభ్యులు సేవలను పొందడానికి లేదా సమస్యలను పరిష్కరించుకోవడానికి తరచుగా తమ ఖాతా ఉన్న నిర్దిష్ట ప్రాంతీయ కార్యాలయంపై ఆధారపడవలసి వచ్చేది.

కొత్త ప్లాట్‌ఫారమ్ ప్రారంభంతో ఆ వ్యవస్థ మారిపోయింది. ఈపీఎఫ్‌వో ​​కేంద్రీకృత నమూనాకు మారింది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న ఏ EPFO ​​కార్యాలయంలోనైనా సభ్యుల సేవలను ప్రాసెస్ చేయడానికి వీలవుతుంది. దీనివల్ల సేవల పంపిణీ వేగవంతం అవుతుందని, అలాగే కార్యాలయాల వారీ ప్రక్రియల వల్ల కలిగే జాప్యాలు తగ్గుతాయని భావిస్తున్నారు.

వచ్చే ఏడాది నుంచి వడ్డీ ఆటోమేటెడ్‌:

అధికారుల ప్రకారం.. ప్రస్తుతం క్షేత్రస్థాయి ధృవీకరణ జరుగుతోంది. ఇది రాబోయే రెండు రోజుల్లో పూర్తి అవుతుందని భావిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత వచ్చే వారంలో 34 కోట్లకు పైగా ఈపీఎఫ్ ఖాతాలకు రూ.1.44 లక్షల కోట్లకు పైగా వడ్డీ జమ చేయనుంది. వచ్చే ఏడాది నుంచి వడ్డీ రుణ ప్రక్రియ మొత్తం పూర్తిగా ఆటోమేటెడ్ అవుతుందని, తద్వారా మానవ ప్రమేయం తగ్గి, ఈ ప్రక్రియ వేగవంతం అవుతుందని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Today Gold Price: మగువలకు మంచి రోజులు.. మళ్లీ రికార్డు స్థాయిలో దిగి వస్తున్న బంగారం ధరలు!

ఇది కూడా చదవండి: Indian Railways: రైలెక్కే ముందు ఎందులో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో మీ మొబైల్‌లోనే తెలుసుకోవచ్చు.. టికెట్ పొందడానికి సూపర్‌ ట్రిక్‌

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us