EPFO: ప్రావిడెంట్ ఫండ్ సంస్థ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికెట్ దాఖలు విషయంలో వెసులుబాటు కల్పించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడానికి ఫిబ్రవరి 28, 2022 వరకు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ వ్యవధిలో అంతరాయం లేకుండా పెన్షన్ పంపిణీ అధికారులు (PDAలు) ద్వారా పెన్షన్ చెల్లించబడుతుందని సంస్థ స్పష్టం చేసింది. ఈపీఎస్95 పెన్షనర్లు ఈ సంవత్సర కాలంలో ఎప్పుడైనా తమ లైఫ్ సర్టిఫికెట్ ను అందించవచ్చని తెలిపింది. ఈ సర్టిఫికెట్ దాఖలు చేసిననాటి నుంచి.. కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే వ్యాలిడిటీ కలిగి ఉంటుందని వెల్లడించింది. ఈ విషయాన్ని తమ ట్విట్టర్ ఖాతా ద్వారా ఈపీఎఫ్ఓ సంస్థ వెల్లడించింది. ఈ సర్టిఫికెట్ ను డిజిటల్ గా కూడా అప్ లోడ్ చేయవచ్చు. అందుకు ఉన్న వివిధ మార్గాలు ఏమిటంటే.. పెన్షన్ పొందుతున్న బ్యాంకు, ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్, UMANG యాప్ లేదా దగ్గరలోని ఏదైనా ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లి లైఫ్ సర్టిఫికెట్ అందించవచ్చని వెల్లడించింది.
ఈ వివరాలను అప్ లోడ్ చేసేందుకు సదరు పెన్షనర్ కు అవసరమైనవి ఏమిటంటే..
1. PPO నంబరు
2. ఆధార్ నంబరు
3. బ్యాంక్ అకౌంట్ నంబరు
4. ఆధార్ కార్డు మెుబైల్ నంబరుకు అనుసంధానించి ఉండడం
అనేక రాష్ట్రాల్లో కొనసాగుతున్న కరోనా కేసులు అధికమవ్వడం.. మహమ్మారి వల్ల వృద్ధులు ఎక్కువగా కరోనా వైరస్‌కు గురయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా.. అన్ని వయసుల పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్‌లను తప్పని సరిగా సమర్పించాలి.
ఇవీ చదవండి..