మతిపోగొడుతున్న EPFO కొత్త అప్డేట్లు.. 3.0 వెర్షన్‌లో ఏకంగా AI ఫీచర్‌! దాని యూజ్‌ ఏంటంటే..?

EPFO తన డిజిటల్ సేవలను EPFO 3.0 కింద భారీగా అప్‌డేట్ చేస్తోంది. ఇందులో కొత్త పోర్టల్, AI-ఆధారిత భాషా అనువాద సాధనాలు, సడలించిన విత్‌డ్రా రూల్స్, UPI ద్వారా EPF డబ్బు ఉపసంహరణ వంటి ఫీచర్లు రానున్నాయి. ఇది వ్యవస్థీకృత, అసంఘటిత కార్మికులకు మెరుగైన, కేంద్రీకృత సేవలను అందిస్తుంది.

మతిపోగొడుతున్న EPFO కొత్త అప్డేట్లు.. 3.0 వెర్షన్‌లో ఏకంగా AI ఫీచర్‌! దాని యూజ్‌ ఏంటంటే..?
Epfo 4

Updated on: Jan 22, 2026 | 7:00 AM

EPFO (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) తన డిజిటల్ సేవలను పెద్ద ఎత్తున అప్డేట్‌ చేస్తోంది. ఇందులో కొత్త పోర్టల్, AI- ఆధారిత భాషా అనువాద సాధనం, అనేక కొత్త ఫీచర్లు ఉంటాయని సమాచారం. EPFO ​​ఇటీవల సడలించిన విత్‌డ్రా రూల్స్‌, UPI ద్వారా డబ్బులు విత్‌డ్రా చేసుకునే సౌకర్యాలు కూడా వీటిలోనే అందుబాటులోకి రానున్నాయి. EPFO 3.0 కింద మొత్తం వ్యవస్థను సరిదిద్దుతామని అధికారులు తెలిపారు.

కొత్త సాంకేతిక మౌలిక సదుపాయాలు క్రియేట్‌ చేస్తున్నారు. బ్యాకెండ్‌లో కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ అమలు, పోర్టల్ పూర్తిగా మార్చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది వ్యవస్థీకృత, అసంఘటిత కార్మికులకు మెరుగైన సేవలను అందిస్తుంది. భవిష్యత్తులో వినియోగదారుల సంఖ్య, లావాదేవీల పరిమాణంలో పెరుగుదలకు అనుగుణంగా ఈ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం EPFOలో దాదాపు 80 మిలియన్ల క్రియాశీల సభ్యులు, సుమారు రూ.28 లక్షల కోట్ల నిధి ఉంది.

ఈ మార్పులు ఉండొచ్చు..

  • పూర్తిగా కొత్త పోర్టల్, బ్యాకెండ్ సాఫ్ట్‌వేర్
  • AI- ఆధారిత సాధనాలు వివిధ భారతీయ భాషలలో సమాచారాన్ని అందిస్తాయి.
  • మొత్తం వ్యవస్థ మరింత కేంద్రీకృతమవుతుంది.
  • కోర్ బ్యాంకింగ్ వ్యవస్థ లాంటి నిర్మాణం
  • కొత్త కార్మిక నియమావళి కింద అసంఘటిత రంగ కార్మికులను కవర్ చేసే ప్రణాళికలో ఈ మార్పు భాగం.
  • భవిష్యత్తులో EPFO ​​అసంఘటిత కార్మికుల కోసం నిధులను కూడా నిర్వహించవచ్చు.
  • UPI ద్వారా EPF డబ్బును ఉపసంహరించుకునే సౌకర్యం

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి