
EPFO Big Alert: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)లోని కోట్లాది మంది సభ్యులకు ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ అయింది. ఆన్‌లైన్‌లో PF ఖాతా సంబంధిత సేవలను ఉపయోగించేటప్పుడు నకిలీ వెబ్‌సైట్‌లు, అనుమానాస్పద లింక్‌లు, సందేశాలు, ఇమెయిల్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని EPFO విజ్ఞప్తి చేసింది. సైబర్ నేరగాళ్లు EPFO వెబ్‌సైట్‌లా కనిపించే నకిలీ వెబ్‌సైట్‌లను సృష్టించి, సభ్యుల నుండి NU, PAN, ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్, పాస్‌వర్డ్, OTP వంటి సున్నితమైన సమాచారాన్ని పొందేందుకు ప్రయత్నించవచ్చు. ఇలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది.
ఇది కూడా చదవండి: Best Scheme: మీ పిల్లల భవిష్యత్తు కోసం రోజుకు రూ.166 పొదుపు చేస్తే.. చేతికి రూ.61 లక్షలు..!
ఈపీఎఫ్‌వో ఆన్‌లైన్ సేవలను విస్తృతంగా ఉపయోగించడం వల్ల సైబర్ మోసాల ప్రమాదం పెరిగింది. సభ్యులు తరచుగా పీఎఫ్ బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి, UAN సంబంధిత పనులు చేయడానికి KYCని అప్‌డేట్ చేయడానికి లేదా క్లెయిమ్ దాఖలు చేయడానికి ఇంటర్నెట్‌లో లింక్‌ల కోసం వెతుకుతారు. ఈ అవకాశాన్ని ఆసరాగా తీసుకుని, మోసగాళ్లు అధికారిక EPFO పోర్టల్ లాగా కనిపించే నకిలీ పేజీలను సృష్టించవచ్చు. అటువంటి వెబ్‌సైట్‌లలోకి లాగిన్ అవ్వమని సభ్యులను కోరి, వారి వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని దొంగిలించడానికి ప్రయత్నించవచ్చని, అందువల్ల ఏదైనా లింక్‌ను తెరిచే ముందు అది అధికారికమైనదో కాదో తనిఖీ చేయడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు.
మోసగాళ్లు కేవలం UAN నంబర్లకే పరిమితం కారు. మీరు ఒక నకిలీ లింక్‌లో సమాచారాన్ని నమోదు చేస్తే వారు ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా, మొబైల్ నంబర్, UAN, లాగిన్ వివరాలను పొందుతారు. OTPని పొందడం వల్ల ఆర్థిక మోసాల ప్రమాదం మరింత పెరగవచ్చని, అందుకే మీకు EPFO పేరుతో ఫోన్ కాల్, వాట్సాప్, SMS లేదా సోషల్ మీడియా సందేశం వస్తే, మీరు దానిని వెంటనే నమ్మకూడదని సూచిస్తోంది ఈపీఎఫ్‌వో. తమ ఉద్యోగులు అటువంటి మార్గాల ద్వారా సభ్యుల నుండి UAN, పాస్‌వర్డ్, ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు లేదా OTPని అడగరని EPFO స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Electric Scooter: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సగం ధరకే.. నెలకు EMI కేవలం రూ.1,863..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి