Indian railways: హైస్పీడ్ లో రైల్వే లైన్ల విద్యుదీకరణ.. టార్గెట్ కు చేరువలో పనులు

|

Dec 01, 2024 | 6:24 PM

దేశంలో అత్యధిక శాతం ప్రజలు ప్రయాణం చేసే రవాణా సాధనాలలో రైళ్లు మొదటి స్థానంలో ఉంటాయి. బ్రిటీష్ పాలనా కాలం నుంచి భారతీయులకు రైళ్లతో అనుబంధం ఉంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన పాలకులు రైళ్లను మరింత అభివృద్ధి చేశారు. దేశంలో నలుమూలలకూ రైలు మార్గాలు ఉన్నాయి. వీటిలో అత్యంత చౌకగా, సురక్షితంగా ప్రయాణం చేయవచ్చు.

Indian railways: హైస్పీడ్ లో రైల్వే లైన్ల విద్యుదీకరణ.. టార్గెట్ కు చేరువలో పనులు
Indian Railway
Follow us on

ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి భారతీయ రైల్వే చర్యలు చేపట్టింది. రైళ్లను మోడరన్ గా తీర్చిదిద్ది, అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. అలాగే బ్రాడ్ గేజ్ రైల్వే విద్యుదీకరణను శరవేగంతో చేస్తోంది. కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్వేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవీ ఇటీవల లోక్ సభలో రైల్వే లైన్ల విద్యుదీకరణపై వివరాలు తెలిపారు. ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, బ్రాడ్ గేజ్ నెట్ వర్క్ లో దాదాపు 97 శాతం విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయని వివరించారు. వందశాతం గ్రీన్ రైల్ నెట్ వర్క్ లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్టు స్పష్టం చేశారు.

భారతీయ రైల్వే దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు రైళ్లను నడుపుతోంది. వీటిలో ప్రజలు ప్రయాణం చేయడంతో పాటు సరుకులు కూాడా రవాణా అవుతాయి. సాధారణంగా రైలు ఇంజిన్లలో డీజిల్ వాడుతూ ఉంటారు. దానికి బదులుగా విద్యుత్ ను ఉపయోగించి ఇంజిన్ నడిచేలా చేయడానికి రైల్వే శాఖ చర్యలు తీసుకుంది. డిజిల్ వాడడం వల్ల కొన్ని ఉద్గారాలు వెలువడి వాతావరణం కాలుష్యమవుతుంది. విద్యుత్ ఉపయోగిస్తే పర్యావరణానికి నష్టం ఉండదు. ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది. బ్రాడ్ గేజ్ అంటే ఒక విధమైన రైల్వే ట్రాక్. దీనిపై పెద్ద రైళ్లు, ఎక్కువ మంది ప్రయాణం చేసే వాటిని, ఎక్కువ సరుకులను రవాణా చేసే వాటిని అనుమతిస్తారు. రైల్వే వ్యవస్థలో ఇవి చాలా కీలకంగా ఉంటాయి. దీంతో ఈ బ్రాడ్ గేజ్ లైన్ నెట్ వర్క్ ను విద్యుదీకరణ చేయడానికి రైల్వే శాఖ చర్యలు చేపట్టింది.

ఈ పనులే 97 శాతం పూర్తయ్యాయని కేంద్ర మంత్రి పార్లమెంటులో ప్రస్తావించారు. 2014-15 నుంచి ఇప్పటి వరకూ బ్రాడ్ గేజ్ నెట్ వర్క్ లోని 45,200 కిలోమీటర్ల లైన్లను విద్యుదీకరణ చేశారు. అప్పట్లో రోజుకు 1.42 కిలోమీటర్లు మాత్రమే జరిగే పనులు ఇప్పుడు దాదాపు 20 కిలోమీటర్ల వరకూ పెరిగాయి. అంటే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డీజిల్ తో పోల్చితే ఎలక్ట్రానిక్ విధానంలో పర్యావరణానికి మేలు కలగడంతో పాటు ఖర్చు దాదాపు 70 వరకూ తగ్గుతుంది. దీని ద్వారా ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు, సేవలు అందజేయవచ్చు. కార్బన్ ఉద్గారాలను తగ్గించుకోవడం ద్వారా గ్రీన్ రైల్వేస్ లో గ్లోబర్ లీడర్ గా స్థిరపడాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. దానిలో భాగంగానే లైన్ల విద్యుదీకరణకు అడుగులు వేస్తోంది. దేశంలోని ఈశాన్య భాగంలో సేవలు అందించే నార్త్ ఈస్ట్ ఫ్రోనిటైర్ రైల్వే (ఎన్ఎఫ్ఆర్) పరిధిలో ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి. అక్కడ బ్రాడ్ గేజ్ మార్గాల్లో విద్యుదీకరణ ప్రాజెక్టులు వేగవంతమయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి