Investments: స్టార్టింగ్‌లో రూ.12 లక్షలు.. ఇప్పుడు రూ.లక్ష.. ఈ వ్యాపారి బాధ వింటే కన్నీళ్లే..
వ్యాపారం అంటేనే లాభాలు, నష్టాలు రెండూ ఉంటాయి. కానీ కొంతమంది బిజినెస్ అంటేనే లాభాలు అనుకుంటారు. కానీ వ్యాపారం స్టార్ట్ చేసి నష్టపోయినవారు ఎందరో ఉన్నారు. తాజాగా ఓ వ్యాపారి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం.

వ్యాపారం స్టార్ట్ చేసి సక్సెస్ అయినవారు కొందరు ఉంటే.. నష్టపోయినవారు కూడా చాలామంది ఉంటారు. వ్యాపారం మొదలుపెట్టినప్పుడు డబ్బులు ఒక్కసారిగా వస్తాయి. అయితే కొన్ని రోజులకు బిజినెస్ మందగిస్తుంది. తాజాగా థానేకు చెందిన దోస రెస్టారెంట్ యజమాని.. సంవత్సరాలు గడిచేకొద్దీ తన వ్యాపార ఆర్థిక పరిస్థితి ఎలా మారిపోయిందో వెల్లడించిన వీడియో వైరల్ అవుతోంది. ఒకప్పుడు తన అవుట్‌లెట్ నెలకు 12 నుంచి 13 లక్షల ఆదాయాన్ని సంపాదించేదని, ఇప్పుడు ఖర్చులు పోనూ నెలకు సుమారు రూ.లక్ష మాత్రమే ఆదా అవుతుందని స్పష్టం చేశారు. రెస్టారెంట్ నడపడానికి అయ్యే ఖర్చులు, సీజనల్ డిమాండ్ గురించి కీలక విషయాలు వెల్లడించాడు. రెస్టారెంట్ నెలవారీ ఆదాయంగా రూ.12 నుంచి 13 లక్షలు సంపాదించింది. కానీ రెస్టారెంట్ తెరిచిన వెంటనే కస్టమర్ల డిమాండ్ పెరగడంతో వ్యాపారం జోరుగా సాగిందని, నెలవారీ ఆదాయం రూ.12 నుంచి రూ.13 లక్షలకు చేరుకుందని చెప్పాడు.
అయితే వినియోగదారుల రాకపోకలు తగ్గడం వల్ల కాలక్రమేణా అమ్మకాలు మందగించాయని వ్యాపారి చెప్పాడు. ప్రతి నెలా అద్దె రూ.లక్ష, సిబ్బంది జీతాలకు దాదాపు రూ.1.5 లక్షలు ఖర్చు చేస్తుందని ఆయన అన్నారు. విద్యుత్ బిల్లులు, ముడి పదార్థాలు, ఇతర నిర్వహణ ఖర్చులు కూడా కలుపుకుంటే.. మొత్తం నెలవారీ ఖర్చు సుమారు రూ.4 లక్షలకు చేరుతుందని అన్నాడు. తన ప్రస్తుత సంపాదన గురించి అతడు చెబుతూ.. వ్యాపార ఖర్చులన్నీ పోగా ఇప్పుడు ప్రతి నెలా సుమారు రూ. లక్ష మాత్రమే మిగులుతోందని అన్నాడు. ఆదాయం తగ్గడానికి కాలానుగుణ మార్పులే కారణమని, వేసవిలో రెస్టారెంట్‌కు వచ్చే కస్టమర్ల సంఖ్య తగ్గడం వల్ల అమ్మకాలపై ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు.
“శీతాకాలంలో ఎక్కువ మంది వినియోగదారులు అవుట్‌లెట్‌కు రావడంతో వ్యాపారం మెరుగుపడుతుంది. లాభాలు తగ్గినప్పటికీ.. ఇతరుల కోసం పనిచేయడం కంటే ఒక వ్యవస్థాపకుడిగా ఉండటానికే నేను ఇష్టపడతా.. భారతదేశంలో నెలకు రూ.80 వేలు జీతం వచ్చే ఉద్యోగాన్ని గౌరవప్రదమైనదిగా భావిస్తారు. నెలకు రూ.12 లక్షలు సంపాదించే దోస రెస్టారెంట్ యజమానిని తరచుగా అలా భావించరు. విజయానికి ఇది వింత నిర్వచనం” కాగా ఈ వ్యాపారి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒక వినియోగదారుడు ఇలా రాశారు..”నిజంగా అద్భుతం, అతను ఉపాధిని కూడా కల్పిస్తున్నాడు.” అని అనగా.. మరొకరు “అది లాభం అయితే అద్భుతం, ఒకవేళ అది ఆదాయం అయినా అద్భుతమే, ఎందుకంటే అతను ప్రజలకు ఉద్యోగాలు ఇస్తున్నాడు” అంటూ కామెంట్ చేశాడు.
