Health Insurance: ఆరోగ్య బీమా క్లెయిమ్ చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..

|

Oct 08, 2024 | 5:45 PM

ఏది ఏమైనా జబ్బులు వస్తే వాటి చికిత్సకు ఆస్పత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చు చేయాలి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమా పాలసీలు తీసుకుంటున్నారు. అయితే కొన్నిసార్లు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న తర్వాత పాలసీలు క్లెయిమ్ కావు. దానికి ఈ కింద తెలిపిన విషయాలు కారణం కావచ్చు.

Health Insurance: ఆరోగ్య బీమా క్లెయిమ్ చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
Health Insurance
Follow us on

ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ చాాలా అప్రమత్తంగా ఉండాలి. దాన్ని కాపాడుకోవడానికి అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఆహారం, శరీరానికి వ్యాయామం, పరిశుభ్రమైన వాతావరణం చాలా అవసరం. నేడు మానవాళిపై అనేక రోగాలు దాడి చేస్తున్నాయి. గతంలో 60 ఏళ్ల తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు 25 ఏళ్ల యువతకే వచ్చేస్తున్నాయి. మారిన జీవనం విధానం, తీసుకునే ఆహారంలో కల్తీ, జంక్ ఫుడ్, వంశపారంపర్యం ఇలా వాటికి అనేక కారణాలు ఉన్నాయి. ఏది ఏమైనా జబ్బులు వస్తే వాటి చికిత్సకు ఆస్పత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చు చేయాలి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమా పాలసీలు తీసుకుంటున్నారు. అయితే కొన్నిసార్లు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న తర్వాత పాలసీలు క్లెయిమ్ కావు. దానికి ఈ కింద తెలిపిన విషయాలు కారణం కావచ్చు.

వివరాల తేడా..

ఆరోగ్య బీమా పాలసీలు తీసుకున్నప్పుడు అన్ని విషయాలు జాగ్రత్తగా, నిజాయితీగా చెప్పాలి. కానీ కొందరు తమ వయసు, ఆదాయం, పనికి సంబంధించిన వివరాలను తప్పుగా చెబుతారు. ఆ వివరాలన్నీ పాలసీలో నమోదు అవుతాయి. కానీ పాలసీని క్లెయిమ్ చేసుకునప్పుడు ఈ తప్పుడు వివరాల వల్ల నష్టం కలుగుతుంది. ఈ తేడా కారణంగానే బీమా కంపెనీలు క్లెయిమ్ ను తిరస్కరిస్తాయి.

కాలపరిమితి..

ఆరోగ్య బీమా పాలసీలను క్లెయిమ్ చేసుకున్నప్పుడు గమనించాల్సిన మరో అంశం కాలపరిమితి. క్లెయిమ్ లను నిర్థిష్ట కాలపరిమతిలోపు దాఖలు చేయాలి. లేకపోతే మీ దావాను బీమా కంపెనీలు తిరస్కరిస్తాయి. కాబట్టి బీమా కంపెనీ నిర్దేశించిన కాలపరిమితిలోపు క్లెయిమ్ చేసుకోవాలి. దీనిపై బీమా తీసుకున్నప్పుడే అవగాహన పెంచుకోవాలి.

రోగాలను దాచకూడదు..

ఆరోగ్య బీమా పాలసీలను తీసుకున్నప్పుడు మన ఆరోగ్యానికి సంబంధించిన అన్ని వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలి. గతంలో వచ్చిన జబ్బులు, దాని ట్రీట్ మెంట్ వివరాలు తెలిపాలి. అయితే ఆరోగ్య బీమా ప్రీమియం ఎక్కువవుతుందనే ఉద్దేశంతో కొందరు ఈ విషయాలు దాస్తారు. దీనివల్ల బీమా తీసుకున్నప్పుడు ఇబ్బంది ఉండదు గానీ, క్లెయిమ్ చేసుకున్నప్పుడు తిరస్కరణకు గురవుతుంది. అనారోగ్య విషయాలను దాచిన కారణంగా కంపెనీ మీకు బీమా డబ్బులు అందజేయదు. ఈ కారణంగా మీ క్లెయిమ్ ను తిరస్కరించే హక్కు బీమా కంపెనీకి ఉంది.

కవరేజ్..

ఆరోగ్య బీమా పాలసీకీ నిబంధనల ప్రకారం కవరేజ్ అందుతుంది. ప్రతి పాలసీకి నిర్ణిష్ట పరిమితి ఉంటుంది. మీరు చేసుకున్న క్లెయిమ్ ఆ పరిమితిని దాటిపోతే బీమా సంస్థ తిరస్కరించే అవకాశం ఉంది. అలాగే క్లెయిమ్ కు అవసరమైన డాక్యుమెంట్లను అందించడంలో విఫలమైనా క్లెయిమ్ ను తిరస్కరిస్తారు.

అవగాహన..

మీరు తీసుకున్న బీమా పాలసీపై పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలి. దాని నిబంధనలు, షరతులను పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలి. మీ పాలసీలోకి ఏ వ్యాధులు, చికిత్సలు వస్తాయో తెలిసి ఉండాలి. దాని పరిధిలోకి రాని చికిత్సల ఖర్చుల కోసం క్లెయిమ్ చేయడానికి ప్రయత్నిస్తే తిరస్కరిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..